నట సింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి రోజు మొత్తం మీద 10.15 కోట్ల షేర్ ని వసూల్ చేయగా రెండో రోజు సినిమా కి గట్టి పోటి ఎదురు అయిన కారణంగా అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయినా కానీ మినిమమ్ కలెక్షన్స్ ని అయినా అందుకుంటుంది అనుకున్నా భారీ షాక్ నే ఇచ్చింది.
సినిమా మినిమమ్ లో మినిమమ్ 3 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో అయినా కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకున్నా అందరి అంచనాలను తలకిందలు చేస్తూ సినిమా సాధించిన కలెక్షన్స్ చూసి టోటల్ ట్రేడ్ వర్గాల మైండ్ బ్లాంక్ అయ్యింది అనే చెప్పాలి.
తొలి ఆటకే మంచి టాక్ ని సొంతం చేసుకుని స్వర్గీయ ఎన్టీఆర్ కి మంచి నివాళి గా ప్రతీ ఒక్కరు భావించిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం పూర్తిగా నిరాశ పరుస్తుంది, ఏమాత్రం హోల్డ్ చేయకుండా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు రెండు రాష్ట్రాలలో కేవలం 1.3 కోట్ల లోపే షేర్ ని అందుకుంది.
ఇది ఎవ్వరూ ఊహించని షాక్ అనే చెప్పాలి. ఇక టోటల్ 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని పరిశీలిస్తే…Nizam – 2.2Cr, Ceeded – 0.95 Cr, Guntur – 2.15 Cr, UA – 0.97 Cr, East – 0.48Cr, West – 0.65 Cr, Krishna – 0.85 Cr, Nellore – 0.56 Cr, AP/TS – 8.81 Cr, Karnataka – 0.7 Cr, ROI – 0.25 Cr, USA : 2.1C, ROW : 0.2C, World Wide 2 Days Share – 12.15 Cr
ఇదీ సినిమా పరిస్థితి… 70.5 కోట్ల బిజినెస్ తో మినిమమ్ 3 స్టార్ రేటింగ్ తో ఓపెన్ అయిన సినిమా ఈ రేంజ్ లో లో కలెక్షన్స్ ని సాధించడానికి రీజన్స్ ఏంటో అర్ధం అవ్వడం లేదు. వర్కింగ్ డే రిలీజ్ అయినా కానీ ఇంతకన్నా చాలా బెటర్ గా హోల్డ్ చేసిన సినిమాలు ఉన్నాయి. కానీ సంక్రాంతి వీక్ లో ఈ కలెక్షన్స్ అందరికీ షాక్ ని గురి చేస్తున్నాయి అనే చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.