Home న్యూస్ ఎన్టీఆర్ మహానాయకుడు మార్నింగ్ షో ఆక్యుపెన్సీ…షాకింగ్!

ఎన్టీఆర్ మహానాయకుడు మార్నింగ్ షో ఆక్యుపెన్సీ…షాకింగ్!

0

     నట సింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ జాగర్ల మూడి ల కాంబినేషన్ లో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండో పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున 900 కి పైగా థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా నేడు రిలీజ్ అవ్వగా ఓవర్సీస్ అండ్ రెండు రాష్ట్రాలలో ప్రీమియర్ షోల తర్వాత సినిమా కి మంచి టాక్ లభించింది అని చెప్పాలి. కాగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా…

పెద్దగా జోరు చూపలేక పోయిన విషయం తెలిసిందే, ఆ ఇంపాక్ట్ మార్నింగ్ షో ఆక్యుపెన్సీ పై గట్టిగానే కనిపిస్తుంది, రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా మార్నింగ్ ఓవరాల్ ఆక్యుపెన్సీ మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు తో పోల్చితే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చే రేంజ్ లో ఉందని చెప్పాలి.

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా మొదటి రోజు మార్నింగ్ షో ఆక్యుపెన్సీ ఓవరాల్ గా 45% వరకు ఉంది, కానీ అదే సమయం లో ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా మార్నింగ్ షో ఆక్యుపెన్సీ మాత్రం అందరికీ షాక్ ఇచ్చే రేంజ్ లో కేవలం 15% లోపే ఉండటం షాక్ ఇస్తుంది.

ఇది బాలయ్య రెగ్యులర్ మూవీస్ తో పోల్చినా చాలా తక్కువే అని చెప్పాలి, ఇక ఓవరాల్ గా సినిమా అన్ సీజన్ లో రిలీజ్ అవ్వడం, బయట సినిమా పై అసలు నిజాలు చూపలేదనే టాక్ మొదటి నుండి ఉండటం మొదటి పార్ట్ విఫలం అవ్వడం ఇలా అనే కారణాలు…

ఓపెనింగ్స్ పై ఇంపాక్ట్ చూపుతున్నాయి అని చెప్పాలి. ఫ్యాన్స్ కూడా టాక్ వస్తేనే థియేటర్స్ కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారేమో అనిపించేలా మార్నింగ్ షో ఆక్యుపెన్సీ ఉంది. ఇక ఓవరాల్ మ్యాట్నీ షో సమయానికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here