900 టు 500…హిస్టారికల్ షాక్ ఇది!

0
747

     నట సింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ జాగర్ల మూడి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ మహానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ లేక చతికిల బడిన విషయం తెలిసిందే, తొలిరోజు 2.12 కోట్లు, రెండో రోజు 60 లక్షలు, మూడో రోజు 30 లక్షలతో సినిమా మొత్తం మీద వీకెండ్ లో 3 కోట్ల రేంజ్ తో సరి పెట్టగా సినిమా వర్కింగ్ డేస్ లో పరిస్థితి మరింత దయనీయంగా మారి పోయింది.

సింగిల్ డిజిట్ కలెక్షన్స్ తో సరిపెట్టుకున్న సినిమా అనేక ఏరియాల్లో డెఫిసిట్ లు పడటం తో సినిమా పరిస్థితి మరింత షాక్ ఇచ్చింది, ఒక స్టార్ హీరో నటించిన సినిమా స్టార్ డైరెక్టర్ తో భారీ స్టార్ కాస్ట్ తో వచ్చి రిలీజ్ అయిన 4 వ రోజు నుండి డెఫిసిట్ లు పడటం…

అంటే మామూలు షాక్ కాదు, ఇక నాలుగో రోజు నుండి సినిమా మైనస్ షేర్ ని కూడా సొంతం చేసుకోవడంతో ఈ సినిమా ను తొలగించి థియేటర్స్ లో పాత సినిమాలను వేస్తుండటం సినిమా పరిస్థితి కి నిదర్శనం అని చెప్పాలి. ఇక సినిమా ప్రదర్శన చూసి…

నిర్మాతలు నాలుగో రోజు నుండే థియేటర్స్ లో పర్సెంటేజ్ లెక్కన నడిపిస్తున్నారు, అంటే కలెక్షన్స్ ఎంత వస్తే అంత…. ఆ మొత్తం డిస్త్రిబ్యూటర్ మరియు థియేటర్ ఓనర్లు పంచుకుంటారు. ఇక సినిమా పరిస్థితి చూసి రిలీజ్ అయిన 900 థియేటర్స్ నుండి సినిమాను ఏకంగా…

400 థియేటర్స్ ని తొలగించారు. దాంతో సినిమా ప్రస్తుతం 500 వరకు థియేటర్స్ లో రన్ అవుతుంది, తొలివారం తర్వాత అందులో 60% నుండి 70% థియేటర్స్ తొలగించబడతాయి అని టాక్ నడుస్తుంది. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ పరుగును అతి త్వరలోనే ముగించడం ఖాయంగా కనిపిస్తుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here