ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ లో చాలా మంది పాన్ ఇండియా లెవల్ కి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళే. ప్రభాస్ తో మొదలైన ఈ పాన్ ఇండియా గేమ్ మరో రెండు మూడేళ్ళ లో అందరు స్టార్స్ తో మరో లెవల్ కి చేరుకునేలా కనిపిస్తుంది. తర్వాత ఎవరు నార్త్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటారో వాళ్లకి ఫ్యూచర్ లో కలిసి వస్తుంది. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా లెవల్ లో…
సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం మూడేళ్ళుగా ఆర్ ఆర్ ఆర్ కోసమే టైం ని కేటాయించిన ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత తన అప్ కమింగ్ మూవీస్ ని అన్నీ పాన్ ఇండియా లెవల్ లోనే చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాలకు తన రెమ్యునరేషన్ కూడా….
సెన్సేషనల్ అనిపించే విధంగా ఉండబోతుందని సమాచారం. టాలీవుడ్ హీరోలలో నిర్మాతలు ఇచ్చే రెమ్యునరేషన్ తో పాటు ఏదైనా ఏరియాల రైట్స్ ని రెమ్యునరేషన్ గా అలాగే ప్రాఫిట్ లో షేర్ ని కూడా రెమ్యునరేషన్ కింద తీసుకునే హీరోల్లో ఎన్టీఆర్ కూడా ఒకరు. ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ కోసం….
రెమ్యునరేషన్ కింద 30 కోట్లు అందుకోబోతున్నాడు… ఇక టోటల్ లాభాల్లో ప్రాఫిట్ షేర్ లెక్కలు వేరే ఉంటాయి. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కోసం అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న అప్ కమింగ్ మూవీ కోసం ఎన్టీఆర్ 40 కోట్ల రెమ్యునరేషన్ ని నిర్మాత నుండి తీసుకోబోతున్నాడట.. తర్వాత ఏరియా రైట్స్ అలాగే….
ప్రాఫిట్ లో షేర్ వాటా ఉండబోతున్నాయని తెలుస్తుంది. అన్నీ కలుపుకుని ఈజీగా ఒక్కో సినిమా కి 70-80 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఉండే అవకాశం ఉంటుందని ట్రేడ్ లో టాక్ ఉంది. ఎన్టీఆర్ అనే కాదు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా రెమ్యునరేషన్, ఏరియా రైట్స్ తో పాటు ప్రాఫిట్ షేర్ లను తీసుకుంటున్నారు. ఇది వరకు ముందు రెమ్యునరేషన్ లేకుండా ఏరియా రైట్స్ ప్రాఫిట్ షేర్ ఉండేది, కానీ పాన్ ఇండియా మూవీస్ విషయం లో రెమ్యునరేషన్ కూడా యాడ్ అవుతుందని సమాచారం…