Home గాసిప్స్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ…2 పవర్ ఫుల్ టైటిల్స్ రిజిస్టర్!!

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ…2 పవర్ ఫుల్ టైటిల్స్ రిజిస్టర్!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్ నుండి నాన్ స్టాప్ గా ఒక్క అపజయం లేకుండా దూసుకు పోతున్న విషయం తెలిసిందే, కానీ అరవింద సమేత తర్వాత కెరీర్ లో పీక్ టైం లో ఎంటర్ అవ్వగా తర్వాత ఇప్పుడు రెండేళ్ళ టైం లో రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ కోసమే కేటాయించడం తో ఫ్యాన్స్ కొద్దిగా నిరాశ చెందుతున్నా కానీ…

ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కమిట్ అయిన మూవీస్ చూసి మాత్రం చాలా ఆశగా ఆ సినిమా ల కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా ఎన్టీఆర్ కే.జే.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేయబోయే అప్ కమింగ్ మూవీ పాన్ ఇండియా లెవల్ లో…

రూపొందబోతున్న విషయం తెలిసిందే, కాగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాల తర్వాత మొదలు కానున్న ఈ సినిమా పై ఇప్పటి నుండే అంచనాలు పీక్స్ లో ఉండగా ఈ సినిమా ను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు ఇప్పుడే ఈ సినిమా గురించి 2 పవర్ ఫుల్ టైటిల్స్ ని రిజిస్టర్ చేయించారు అన్నది టాలీవుడ్ టాక్.

ఆ టాక్ ప్రకారం ఆ టైటిల్స్ ఏంటంటే… ఒకటి “మిసైల్” కాగా మరోటి “న్యూక్లియర్”… ఈ రెండు టైటిల్స్ ని ఫిలిం ఛాంబర్ లో రీసెంట్ గా రిజిస్టర్ చేయించారు అంటున్నారు. దాంతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ల కాంబినేషన్ లో తెరకెక్కే అప్ కమింగ్ మూవీ కి ఈ రెండు టైటిల్స్ లో ఎదో ఒకటి కన్ఫాం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ బాలెన్స్ షూట్ కోసం బిజీ కాబోతుండగా ప్రశాంత్ నీల్ కే.జే.ఎఫ్ ని కంప్లీట్ చేసే పనుల్లో బిజీ అవుతున్నారని సమాచారం. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకోనున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా తర్వాత కొత్త సినిమా మొదలు పెడతారని అంటున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here