టాలీవుడ్ లో ఉన్న ఏరియాల్లో మాస్ మూవీస్ కి మాస్ హీరోలకు ఫుల్ అండగా నిలిచే ఏరియా రాయలసీమ, ఇక్కడ టాక్ మాస్ ఆడియన్స్ కి నచ్చే విధంగా ఉంటే చాలు అద్బుతమైన కలెక్షన్స్ వస్తాయి. ఇక ఆ టాక్ కి స్టార్ హీరో తోడూ అయితే ఆ లెక్క మరో రేంజ్ లో ఉంటుంది. గడచిన కొంతకాలంగా ఇక్కడ ఓపెనింగ్స్ పరంగా అందరు హీరోల క్రేజ్ ఒకెత్తు యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ మరో ఎత్తుగా చెప్పుకోవాలి.
#VinayaVidheyaRama-7.15Cr(4.6Cr hires)
#AravindaSametha-5.45Cr
#Saaho – 4.7Cr+
#JaiLavaKusa -4.28Cr
#SardaarGabbarSingh-4.1Cr
#Rangasthalam -3.75Cr
#Janathagarage-3.55Cr
#KhaidiNo150-3.4Cr ఇవి రీసెంట్ టైం లో అక్కడ మొదటి రోజు హైయెస్ట్ షేర్ ని అందుకున్న టాప్ సినిమాలు ఇందులో ఎన్టీఆర్ నటించిన లాస్ట్ 3 సినిమాలు నిలిచాయి. ఇక ఎన్టీఆర్ లాస్ట్ మూవీ…
అరవింద సమేత వీర రాఘవ ఇక్కడ టికెట్ సేల్స్ ద్వారా వచ్చిన అమౌంట్ ఏకంగా 5 కోట్ల 45 లక్షలు వచ్చింది, అది బాహుబలి 2 కి దరిదాపుల్లోకి వెళ్ళిన మొదటి సినిమా. తర్వాత వచ్చిన వినయ విదేయ రామ సినిమా ఇక్కడ 7.15 కోట్ల షేర్ ని అందుకున్నా అందులో 4.6 కోట్ల హైర్స్ ఉన్నాయి. వర్త్ షేర్ కేవలం 2.55 కోట్లు మాత్రమే.
ఇక 350 కోట్ల బడ్జెట్ తో హ్యుమంగస్ అంచనాలతో బాహుబలి 2 లాంటి హిస్టారికల్ మూవీ తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమా సాహో కూడా ఇక్కడ మొదటి రోజు టికెట్ సేల్స్ ద్వారా 4.7 కోట్ల దాకా షేర్ ని మాత్రమె అందుకుని అరవింద సమేత ని అందుకోలేక పోయింది.
అంటే సీడెడ్ లో ఎన్టీఆర్ డామినేషన్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ నటించే అప్ కమింగ్ మూవీ ఇప్పట్లో రాదు కాబట్టి ఈ రికార్డ్ అందుకునే అవకాశం ఇప్పుడు ఎక్కువగా ఉన్న సినిమా మెగాస్టార్ నటించిన సైరా కి… మరో నెల లో వస్తున్న ఆ సినిమా అయినా వర్త్ షేర్ పరంగా ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.