రీసెంట్ టైం లో వరుస పెట్టి ఫ్లాఫ్స్ ను ఫేస్ చేస్తూ కంప్లీట్ గా ఫామ్ కోల్పోయిన శర్వానంద్ ఆశలు పెట్టుకున్న సినిమాలు నిరాశ పరిచాయి. కానీ ఎప్పుడో రావాల్సిన ఒకే ఒక జీవితం సినిమా పై ఎవ్వరికీ కూడా అంచనాలు లేవు, కానీ టీసర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కాన్సెప్ట్ అందరికీ నచ్చి సినిమా పై కొద్ది వరకు బజ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు మెప్పించింది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా కథ పాయింట్ విషయానికి వస్తే….
చిన్నప్పుడే తల్లిని ఓ ఆక్సిడెంట్ లో కోల్పోయిన హీరో అప్పటి నుండి భయపడుతూ మంచి సింగర్ అయినా అందరి ముందు పాదలేకపోతూ తన అమ్మ ఉంటే బాగుండు అనుకుంటాడు, హీరో ఫ్రెండ్స్ లో వెన్నెల కిషోర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయినా చదువు లేక పోవడంతో తాను చదువుకుని ఉంటె బాగుండేది అనుకుంటాడు, మరో ఫ్రెండ్ ప్రియదర్శి చిన్నప్పుడు నచ్చలేదు అన్న అమ్మాయి పెద్దయ్యాక బాగుండటం తనకి చిన్నప్పుడు నో ఎందుకు చెప్పానా అనుకుంటూ ఉంటాడు…
ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య కాగా వీళ్ళకి తిరిగి టైం మిషన్ లో వెనక్కి వెళ్లి తమ తప్పులను సరిచేసుకునే అవకాశం వస్తే ఏం చేశారు, తాము అనుకున్నది జరిగిందా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… పెర్ఫార్మెన్స్ పరంగా శర్వానంద్ తన నాచురల్ యాక్టింగ్ తో ఎప్పటి లానే అదరగొట్టేశాడు, అమల రోల్ కూడా బాగుండగా వెన్నెల కిషోర్ ప్రియదర్శి ల రోల్స్ కూడా బాగా మెప్పించాయి.
హీరోయిన్ రితు వర్మ రోల్ జస్ట్ ఓకే అనిపించగా నాజర్ రోల్ పర్వాలేదు అనిపిస్తుంది… మిగిలిన యాక్టర్స్ ఉన్నంతలో బాగా చేశారు. సంగీతం పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది, ఎడిటింగ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ అదిరి పోయింది, సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అయింది, సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్ లెంట్ గా ఉన్నాయి.. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే టైం మిషన్ అనే కాన్సెప్ట్ మీద ఉన్న సినిమాలు తక్కువే అయినా… కరెక్ట్ గా తీస్తే ఆ ఫార్మాట్ చాలా సక్సెస్ ఫుల్ అని ఈ సినిమా మరోసారి నిజం చేసింది…
డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ కి అమ్మ ప్రేమని జోడించి చాలా బాగా డీల్ చేశాడు, ఫస్టాఫ్ అయితే చాలా బాగా కుదరగా సెకెండ్ ఆఫ్ అక్కడక్కడా స్లో అవ్వడం కథ లో సీన్స్ ని ఆడియన్స్ అంచనాలను తగ్గట్లు సాగడంతో కొంచం ట్రాక్ తప్పినా క్లైమాక్స్ మళ్ళీ బాగా డీల్ చేసి ఓ హార్ట్ టచింగ్ స్టొరీగా సినిమాను ముగించాడు…. కథలో అక్కడక్కడా ఫ్లాస్ ఉన్నప్పటికీ నరేషన్ కొంచం స్లో అయినట్లు అనిపించినా కానీ…
శర్వానంద్ రీసెంట్ మూవీస్ అన్నింటిలోకీ కూడా ఈ సినిమా ది బెస్ట్ అని చెప్పాలి. ఆడియన్స్ ఎలాగూ పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్స్ కి వెళతారు కాబట్టి వాళ్ళకి కచ్చితంగా సినిమా అయిన తర్వాత ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో బయటికి రావడం ఖాయం… మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 3 స్టార్స్….ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా జోరు చూపిస్తుందో చూడాలి.