ఒక కాన్సెప్ట్ తో పలు సినిమాలు రావడం అన్నది సర్వసాధారణంగా జరుగుతూ వచ్చేదే. ముందు ఒకరు అనుకున్న కాన్సెప్ట్ ని తర్వాత అనుకున్న వాళ్ళు వెంటనే మొదలు పెట్టి ముగించిన సందర్బాలు కూడా చాలానే ఉన్నాయి. టాలీవుడ్ లో ఇప్పుడు ఇలాంటిదే మరొకటి వెలుగులోకి వచ్చింది. రీసెంట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో టి సిరీస్ అత్యంత భారీ ఎత్తున ఆదిపురుష్ అనే సినిమాను…..
అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే, రామాయణంని బేస్ చేసుకుని ఈ సినిమా ఉంటుందని, ప్రభాస్ ఇందులో రాముడిగా కనిపిస్తారని కన్ఫాం చేశారు. ఈ అనౌన్స్ మెంట్ అందరూ హ్యాప్పీ గా ఉండగా మరో పక్క మూడేళ్ళ క్రితం అల్లు అరవింద్ అనౌన్స్ చేసిన సినిమాను కాన్సిల్ చేశారు.
అల్లు అరవింద్ బాలీవుడ్ పలువురు నిర్మాతలతో కలిసి సుమారు 500 కోట్ల రేంజ్ బడ్జెట్ తో సంపూర్ణ రామాయాణాన్ని మూడు భాగాలుగా అత్యంత భారీ గా రూపొందించాలి అని ప్లాన్ చేశారు. కొందరు హీరోలను దర్శకులను కూడా ఈ ప్రాజెక్ట్ కోసం అప్రోచ్ అయ్యారు కానీ పెద్దగా ఎవరూ పాజిటివ్ గా స్పందించలేదు.
ఈ లోపు ఎవరి ప్రాజెక్టులతో వాళ్ళు బిజీ గా ఉండగా ఈ సినిమా టాపిక్ ఈ మధ్య వినపడలేదు, రీసెంట్ గా ప్రభాస్ సినిమా అనౌన్స్ అవ్వడం ఆలస్యం ఇక ఈ సినిమా మీద ఆశలు వదిలేసుకున్న అల్లు అరవింద్ ఇప్పుడు ఈ సినిమా కోసం ముందు అప్రోచ్ అయిన బాలీవుడ్ వాళ్ళతో 60-70 కోట్ల రేంజ్ బడ్జెట్ లో…
వెబ్ సిరీస్ తీసి తమ ఆహా యాప్ లో ఎక్స్ క్లూజివ్ గా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. ప్రభాస్ తో అత్యంత భారీ ఎత్తున రూపొందుతున్న ఆదిపురుష్ సినిమా అల్లు అరవింద్ ప్లాన్ చేసిన విధంగా 3 భాగాలుగా కాకుండా కేవలం 1 పార్ట్ తోనే కంప్లీట్ అవుతుంది అని సమాచారం.