ఒకప్పుడు తెలుగు లో వరుస పెట్టి సినిమాలు చేసి లవర్ బాయ్ గా తనకంటూ మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్న యాక్టర్ సిద్దార్థ్ చాలా కాలంగా టాలీవుడ్ కి దూరంగా ఉంటూ కోలివుడ్ లోనే సినిమాలు చేసుకుంటూ వస్తుండగా 2019 టైం లో తమిళ్ లో చేసిన సిద్దార్థ్ సినిమా తెలుగు లో ఒరేయ్ బామ్మర్ది పేరుతో శశి తెరకెక్కించారు, జీవీ ప్రకాష్ కూడా నటించిన ఈ సినిమా ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ కి వస్తే… సిన్సియర్ ట్రాఫిక్ పోలిస్ అయిన హీరో బైకు రేసులలో పాల్గొన జీవీ ప్రకాష్ ని ఒకసారి పట్టుకుని తనదైన స్టైల్ లో పోలిస్ ట్రీట్ మెంట్ ఇస్తాడు… అప్పటి నుండి ఆ పోలిస్ పై పగ తీర్చుకోవలాని చూసే జీవీ ప్రకాష్ కి అనుకోకుండా తన అక్కతో తనకి పెళ్లి అయ్యిందని తెలుస్తుంది…
తర్వాత వీళ్ళ లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది, ఇంతకీ బావా బామ్మర్దులు కలిసారా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కథ గా చెప్పాలి అంటే మంచి పాయింట్ నే తీసుకున్న డైరెక్టర్ శశి బిచ్చగాడు రేంజ్ లో ఎమోషన్స్ ని పండించడంలో పూర్తిగా సక్సెస్ కాలేదు.
సిద్దార్థ్ తన రోల్ లో అదరగొట్టాడు, తన డైలాగ్స్ డబ్బింగ్ కూడా బాగా మెప్పించాయి, జీవీ ప్రకాష్ కూడా ఆకట్టుకోగా హీరోయిన్స్ ఇద్దరూ కొత్తవాళ్ళు అయినా తమ మార్క్ ని చూపెట్టారు, సాంగ్స్ యావరేజ్ గా ఉన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పిస్తుంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ లో సీన్స్ మరీ రిపీటివ్ గా అనిపించడం…
అక్కడక్కడా కొంచం తమిళ్ ఫ్లేవర్ ఎక్కువ అవ్వడం లాంటివి కొంచం ఇబ్బంది పెట్టినా ఓవరాల్ గా సినిమా ఈజీగా ఒకసారి చూసే విధంగా ఉంది. ఎలాగూ జనాలు మరీ అంచనాలు ఏమి పెట్టుకోకుండానే థియేటర్స్ కి వెళతారు కాబట్టి ఈజీగా సినిమా పర్వాలేదు అనిపించేలా మెప్పించే అవకాశం ఉంది. సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.75 స్టార్స్…