Home న్యూస్ ఇదేం మాస్ రా బాబు….2 రైట్స్ కే 18.5 కోట్లు….మాస్ ఇది!!

ఇదేం మాస్ రా బాబు….2 రైట్స్ కే 18.5 కోట్లు….మాస్ ఇది!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో శర్వానంద్ అలాగే తెలుగు లో స్ట్రైట్ మూవీ చేసి చాలా కాలం అవ్వడం తో మంచి రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న సిద్దార్థ్ లు కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ మహా సముద్రం. బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా బరిలో నిలవబోతున్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి ఇప్పుడు…

ముఖ్యంగా మాస్ ఏరియాల్లో సినిమా ట్రైలర్ మంచి రీచ్ ని అండ్ క్రేజ్ ను సొంతం చేసుకోవడం తో సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా బిజినెస్ కూడా జోరు అందుకుంది.

థియేట్రికల్ బిజినెస్ లెక్కలు ఇంకా బయటికి రావాల్సి ఉండగా సినిమా శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ కే అల్టిమేట్ రేట్లని సొంతం చేసుకుందని సమాచారం. సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ వాళ్ళు ముందు 10.5 కోట్ల రేటు కి తీసుకున్నారు అని వార్తలు వచ్చినా ఇప్పుడు అసలు లెక్క 11 కోట్లకి తెగింది అని తెలిసింది.

ఇక సినిమా శాటిలైట్ రైట్స్ కి రేటు 7.5 కోట్ల దాకా దక్కింది అంటున్నారు ఇప్పుడు… దాంతో కేవలం డిజిటల్ అండ్ శాటిలైట్ రైత్స్స్ ద్వారానే ఈ సినిమా కి ఏకంగా 18.5 కోట్ల రేటు సొంతం అయ్యింది అని చెప్పాలి. ఇంకా హిందీ డబ్బింగ్ రైట్స్ అలాగే ఇతర భాషల డబ్బింగ్ రైట్స్ లాంటివి కూడా ఉండటం తో నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే చాలా మొత్తాన్ని ఈ సినిమా…

ఇప్పుడు వెనక్కి రాబట్టే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా దసరా బరిలో నిలుస్తూ ఉండగా సినిమా అకి టాక్ పాజిటివ్ గా వస్తే మాస్ సెంటర్స్ లో లాంగ్ రన్ సాలిడ్ గా ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక శర్వానంద్ అండ్ సిద్దార్థ్ లు ఈ సినిమా తో మంచి హిట్ ని సొంతం చేసుకుంటారో లేదో చూడాలి ఇక..

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here