Home న్యూస్ పందెం కోడి 2 ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్!

పందెం కోడి 2 ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్!

0

  విశాల్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ పందెం కోడి 2 బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ముగించుకుంది. సినిమా తెలుగు లో కొన్ని ఏరియాల్లో ఓన్ గా మిగిలిన ఏరియాల్లో మొత్తం మీద 6 కోట్లకు అమ్ముడు పోగా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి 4 రోజుల్లో మొత్తం మీద 5.2 కోట్ల దాకా షేర్ ని అందుకున్న విషయం తెలిసిందే. కానీ వర్కింగ్ డేస్ విషయంలో మాత్రం…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో జోరు ని చూపలేదు. కానీ ఓవరాల్ గా 3 రోజుల్లో తెలుగు లో సినిమా మరో 90 లక్షల దాకా షేర్ ని అందుకోగా టోటల్ గా మొదటి వారానికి గాను ఈ సినిమా 6.1 కోట్ల షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకుంది.

ఇక తమిళ్ వర్షన్ టోటల్ గా 15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా సినిమా ఫస్ట్ వీక్ లో 21 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది. సినిమా తెలుగు తమిళ్ కలిపి బిజినెస్ 30 కోట్ల రేంజ్ లో ఉండగా బ్రేక్ ఈవెన్ కి మరో 10 కోట్లు వసూల్ చేయాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here