Home న్యూస్ పందెం కోడి 2 (4 రోజుల) టోటల్ కలెక్షన్స్!

పందెం కోడి 2 (4 రోజుల) టోటల్ కలెక్షన్స్!

0

  విశాల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పందెం కోడి 2 బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని బాగానే ముగించుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో మొత్తం మీద ప్రీ రిలీజ్ బిజినెస్ కింద సుమారు 6 కోట్ల బిజినెస్ చేయగా 7 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద 3 రోజుల్లో 4.2 కోట్ల దాకా షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకున్న విషయం తెలిసిందే.

ఇక సినిమా ఆదివారం రోజున కూడా జోరు ని కొనసాగించగా మొత్తం మీద 90 లక్షల దాకా షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకున్నట్లు సమాచారం. దాంతో మొత్తం మీద 4 రోజుల వసూళ్లు ఇప్పుడు 5.1 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్నాయి.

ఇక సినిమా తమిళ్ వర్షన్ వీకెండ్ మొత్తం మీద షేర్ సుమారు 12.5 కోట్ల రేంజ్ లో ఉంటుందని సమాచారం.. తెలుగు తమిళ్ కలిపి పందెం కోడి 2 టోటల్ గా 17.6 కోట్ల దాకా షేర్ ని 4 రోజుల్లో అందుకుని విశాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here