Home న్యూస్ మూడు రోజుల్లో 4.2 కోట్లు…విశాల్ కుమ్మేస్తున్నాడు

మూడు రోజుల్లో 4.2 కోట్లు…విశాల్ కుమ్మేస్తున్నాడు

0

 

  కోలీవుడ్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ పందెం కోడి 2 బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 2.8 కోట్ల షేర్ ని అందుకోగా మూడో రోజు మొత్తం మీద ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా మరో 90 లక్షల దాకా షేర్ ని అందుకోగా నిర్మాతలు తెలుగు వర్షన్ ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కాగా సినిమా కలెక్షన్స్ ఇప్పుడు 4 కోట్ల మార్క్ ని దాటేశాయి.

సినిమా మొత్తం మీద రెండు రాష్ట్రాలలో 3 రోజుల్లో 4.2 కోట్ల షేర్ ని అందుకుందని అనౌన్స్ చేశారు నిర్మాతలు.. విశాల్ కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ తెలుగు ఓపెనర్ అని అంటున్నారు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో 5 కోట్ల మార్క్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 3 రోజుల్లో 4.2 కోట్ల షేర్ ని అందుకోగా క్లీన్ హిట్ కి సినిమా మరో 2.8 కోట్లు కలెక్ట్ చేస్తే సరిపోతుంది. మొదటి వారం ముగిసే లోపు ఈ మార్క్ ని అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here