Home న్యూస్ మూడు సినిమాల బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్!!

మూడు సినిమాల బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్!!

0

     యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల్లో అల్టిమేట్ వసూళ్లతో దుమ్ము లేపగా సినిమా మొత్తం మీద 10 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 67.23 కోట్ల షేర్ ని రెండు రాష్ట్రాలలో వరల్డ్ వైడ్ గా 91.2 కోట్ల షేర్ ని మరియు టోటల్ వరల్డ్ వైడ్ గా 149 కోట్ల వరకు గ్రాస్ మార్క్ ని అందుకుని ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర  11 వ రోజు భారీ లెవల్ లో కాకపోయినా మళ్ళీ 7 వ రోజు లెవల్ లో ఓపెన్ అయింది అని చెప్పొచ్చు. ఆది వారం అవ్వడంతో సినిమా మార్నింగ్ మ్యాట్నీ షోలు ఎలా ఉన్నా ఈవినింగ్ షోలకి బుకింగ్స్ బాగున్నా సినిమా సక్సెస్ మీట్ ఉండటం బాలయ్య చీఫ్ గెస్ట్ గా రానుండటం కొంతవరకు ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉంది.

దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు మొత్తం మీద 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి అంతకుమించి కలెక్షన్స్ ని అందుకోగలుగుతుందా లేదా అనేది నైట్ షోల బుకింగ్స్ ని బట్టి ఉంటుంది.

ఇక రామ్ నటించిన హెలొ గురు ప్రేమ కోసమే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల్లో 11.74 కోట్ల షేర్ ని అందుకోగా సినిమా ఇప్పుడు 4 వ రోజు కూడా స్టడీగానే ఓపెన్ అయింది. మరీ మూడో రోజు రేంజ్ లో రాకున్నా 2.5 కోట్ల రేంజ్ కలెక్షన్స్ 4 వ రోజు కూడా ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక విశాల్ పందెం కోడి 2 4.2 కోట్ల షేర్ తో 3 రోజులను ఘనంగా ముగించగా సినిమా ఇప్పుడు 4 వ రోజు మరోసారి మాస్ సెంటర్స్ లో జోరు చూపుతుండగా సినిమా మరోసారి 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఖాయమని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here