అమ్మింది 124.4 కోట్లు..6 రోజుల్లో వచ్చింది ఇది!!

0
1821
PETTA 6 Days Box Office Collections
PETTA 6 Days Box Office Collections

 కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ పేట బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో కోలివుడ్ లో దూసుకు పోతుంది, తెలుగు లో కొత్త సినిమాల పోరు వలన సినిమా కొంచం స్లో డౌన్ అయినా కానీ ఓవర్సీస్ లో మరియు తమిళనాడు లో చూపుతున్న జోరు తో మొదటి 6 రోజులను సూపర్ సాలిడ్ గా ముగించి బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ ఓపెనింగ్స్ ని అందుకుంటూ దూసుకు పోతుంది.

6 రోజుల సినిమా కలెక్షన్స్ ని పరిశీలిస్తే, తమిళ్ లో 70 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 7.5 కోట్లు, కర్ణాటక లో 9.75 కోట్లు, కేరళ లో 5.15 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 3.9 కోట్లు.. వసూల్ చేసిన ఈ సినిమా ఇండియా లో టోటల్ గా 96.3 కోట్ల గ్రాస్ ని అందుకుంది.

ఇక సినిమా టోటల్ ఓవర్సీస్ లో 42.5 కోట్ల గ్రాస్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 138.8 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఇక వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే ఓవరాల్ గా 71 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా బిజినెస్ 124.4 కోట్లు అవ్వడం తో బ్రేక్ ఈవెన్ కి మరో 53.4 కోట్ల షేర్ ని 100 కోట్ల గ్రాస్ ని అందుకోవాల్సి ఉంటుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!