Home న్యూస్ 24 గంటల్లో పొగరు ట్రైలర్ కి షాకింగ్ వ్యూస్…తెలుగు లో రికార్డ్ ఇది!

24 గంటల్లో పొగరు ట్రైలర్ కి షాకింగ్ వ్యూస్…తెలుగు లో రికార్డ్ ఇది!

0

టాలీవుడ్ లో లోకల్ మూవీస్ తో పాటు ఇతర ఇండస్ట్రీ ల నుండి వచ్చే సినిమాలను కూడా సమానంగా ఆదరిస్తూ ఉంటారు. దానికి నిదర్శనంగా ఎన్నో సినిమాలు తెలుగు లో స్ట్రైట్ మూవీస్ కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నవి ఉన్నవి, వాటితో పాటు మన వాళ్ళు ఇతర ఇండస్ట్రీల నుండి వచ్చిన సినిమాల టీసర్ ట్రైలర్ లు కూడా విరగబడి చూడటం కూడా కామన్ కానీ మరీ…

రికార్డ్ లెవల్ లో వ్యూస్ దక్కించడం మాత్రం కొన్ని సార్లే జరిగింది… రీసెంట్ గా కన్నడ నుండి తెలుగు లోకి వస్తున్న ధృవ్ సార్జా రష్మిక ల కాంబినేషన్ లో వస్తున్న పొగరు సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి 24 గంటల్లో అల్టిమేట్ వ్యూస్ ని సొంతం చేసుకుంది.

సినిమా లో కరాబు అనే సాంగ్ అల్టిమేట్ హిట్ అవ్వడం తో సినిమా సౌత్ భాషల్లో కూడా రీచ్ ని సొంతం చేసుకుని రిలీజ్ అయ్యేలా క్రేజ్ సొంతం చేసుకోగా తెలుగు లో ఈ సినిమా ట్రైలర్ కి మొదటి 24 గంటల్లో ఏకంగా 4.5 మిలియన్స్ వరకు వ్యూస్ సొంతం అయ్యాయని సమాచారం.

ఇది తెలుగు ఇతర ఇండస్ట్రీల డబ్బింగ్ మూవీస్ పరంగా రికార్డ్ వ్యూస్ అని చెప్పొచ్చు. ఇక 72 వేల లైక్స్ ని 24 గంటల్లో సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ తమిళ్ లో కూడా ఆల్ మోస్ట్ 4 మిలియన్స్ వరకు వ్యూస్ ని సొంతం చేసుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సినిమా ను ఒక్క సాంగ్ హైప్ తెచ్చేలా చేయగా ఇప్పుడు సినిమా కి వస్తున్న ఈ వ్యూస్ చూసి సినిమాను…

సౌత్ లో భారీగా రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ముందు సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ ఎక్కువ సినిమాలు ఉండటం తో వెనక్కి తగ్గి ఇప్పుడు సినిమాను జనవరి ఎండింగ్ థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

https://www.youtube.com/watch?v=Tvr8WHol9Lk

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here