Home న్యూస్ “ప్రతీ రోజు పండగే” ట్రైలర్ రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్!!

“ప్రతీ రోజు పండగే” ట్రైలర్ రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్!!

0

     మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ చిత్రలహరి హిట్ తర్వాత నటిస్తున్న కొత్త సినిమా “ప్రతీ రోజు పండగే”… మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి ధరం తేజ్ కి జోడిగా రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ముఖ్య పాత్రలో సత్య రాజ్ నటిస్తున్న విషయం తెలిసిందే, డిసెంబర్ ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు.

ట్రైలర్ లోనే మూవీ కాన్సెప్ట్ ని చెప్పేశారు… లంగ్స్ కాన్సర్ వల్ల 5 వారాలలో చనిపోయే తాత తన కుటుంబం మొత్తాన్ని తిరిగి చూడాలి అనుకుంటాడు. దానికి మనవడు సాయి ధరం తేజ్ ఎలా హెల్ప్ చేశాడు అన్నది ఓవరాల్ గా సినిమా కాన్సెప్ట్ గా ట్రైలర్ లో తెలుస్తుంది.

ఈ కాన్సెప్ట్ చూస్తె ఈజీగా అందరికీ 2017 సంక్రాంతి కి వచ్చిన శతమానం భవతి సినిమా గుర్తుకు రాక మానదు. ట్రైలర్ చూస్తుంటే ఆ సినిమా గుర్తుకు వస్తున్న టైం లో ఎండ్ అయ్యే సమయం లో మనం అనుకున్నదే ఎవరో చెప్పినట్లు ట్రైలర్ లో కూడా ఆ మూవీ ని గుర్తు చేశారు.

చూస్తుంటే ఆ సినిమా ను బాగానే ఇన్స్ స్పైర్ అయినట్లు కనిపిస్తున్నా ఈ ట్రైలర్ లో కూడా ఫ్రెష్ నెస్ బాగానే ఉందని చెప్పాలి, కామెడీ కొంచం యాక్షన్ అలాగే సెంటిమెంట్ ఆల్ ఇన్ ఆల్ మంచి ఫ్యామిలీ మూవీ గా ఉండేలా ఉంది ఈ సినిమా. ట్రైలర్ చూస్తున్నంత సేపు శతమానం భవతి సినిమా గుర్తుకు రావడం ఒక్కటే చిన్న మైనస్ కాగా..

రాశిఖన్నా కామెడీ అండ్ సాయి ధరం తేజ్ తో తన పెయిర్, సత్యరాజ్ రోల్, రావ్ రమేష్ క్యారెక్టర్ అన్నీ రీఫ్రెషింగ్ గానే ఉండటం తో సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ వస్తే సంక్రాంతి వరకు తిరుగు ఉండదని కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. చూద్దాం మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో మరి.. మీరు ట్రైలర్ చూస్తె ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here