Home న్యూస్ మూడేళ్ళుగా హిట్లు లేవు….అయినా మన్మథుడు2 బిజినెస్ కుమ్మేశాడు

మూడేళ్ళుగా హిట్లు లేవు….అయినా మన్మథుడు2 బిజినెస్ కుమ్మేశాడు

0

2016 ఇయర్ లో సోగ్గాడే చిన్ని నాయన మరియు ఊపిరి సినిమాలతో బాక్ టు బాక్ హిట్స్ తో సూపర్ ఫామ్ లో దూసుకు పోయిన కింగ్ నాగార్జున తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు అనుకున్న రేంజ్ లో హిట్లు కొట్టలేదు, గత ఏడాది ఆఫీసర్ మరియు దేవదాస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా అఫీషియల్ టాలీవుడ్ హిస్టరీ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలిచి పోయింది. ఇక దేవదాస్ సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది, ఇలాంటి సమయం లో తన కెరీర్ లో కల్ట్ క్లాసిక్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన మన్మథుడు సినిమాకి సీక్వెల్ గా మన్మథుడు 2 సినిమా తో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కింగ్ నాగార్జున.

కాగా వరుసగా మూడేళ్ళుగా హిట్లు పెద్దగా లేకున్నా కానీ మన్మథుడు 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే నాన్ థియేట్రికల్ బిజినెస్ కింద 21 కోట్ల బిజినెస్ చేయగా ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ కింద కూడా మంచి బిజినెస్ నే సొంతం చేసుకుంది. సినిమా ఓవరాల్ బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి…

Nizam – 7Cr
Ceeded – 2.5Cr
Andhra – 7Cr
AP-TG: 16.5Cr
Ka – 1.3Cr
ROI – 0.30Cr
Overseas – 2.40Cr
Total: 20.50 Cr
ఇదీ మొత్తం మీద కింగ్ నాగార్జున మన్మథుడు 2 సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్, సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే… బాక్స్ ఆఫీస్ బరిలో… 21.5 కోట్ల వరకు షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది,

ఇక సినిమాకి వచ్చే వారం ఆగస్టు 15 వీకెండ్ హాలిడేస్ కూడా ఒక అడ్వాంటేజ్ ఉండటం తో ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తొలి వారం 10 రోజుల లోపే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here