మలయాళంలో సెన్సేషనల్ కలెక్షన్స్ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఇతర రాష్ట్రాలలో సైతం భారీ ఆసక్తిని కలిగేలా చేసిన సినిమా ప్రేమలు(Premalu Movie Telugu Review) అవడానికి మలయాళ సినిమానే అయినా కూడా చాలా వరకు కథ హైదరాబాదులోనే జరగడంతో సినిమా మీద మరింత క్రేజ్ ఏర్పడగా వెంటనే సినిమాను డబ్ చేసి ఇప్పుడు శివరాత్రి కానుకగా రిలీజ్ చేశారు…
మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ… స్టోరీ పాయింట్ కి వస్తే స్టడీ ఎలాగోలా కంప్లీట్ చేసుకున్న హీరో తన ఫ్యూచర్ మొత్తం ఎలా ఉండాలి అని ఊహించుకునే హీరోయిన్ ని చూసి ఇష్టపడతాడు, రెండు వేరు వేరు ఆలోచనలు ఉన్న హీరో హీరోయిన్ ల లవ్ స్టోరీ ఎలా సాగింది అన్నది ఓవరాల్ గా సినిమా కథ…
సింపుల్ గా చెప్పాలి అంటే చాలా సాదాసీదా స్టోరీ పాయింట్ తో తెరకెక్కిన సినిమా ప్రేమలు….కానీ రొటీన్ స్టోరీనే మంచి కామెడీతో యూత్ కి నచ్చేలా తీస్తే ఆ లవ్ స్టోరీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం ఖాయమని మరోసారి ఈ సినిమా నిరూపించింది, సింపుల్ స్టోరీ కి ఎక్స్ లెంట్ కామెడీ సీన్స్ ను రాసుకున్న డైరెక్టర్ ఔట్ అండ్ ఔట్…
మంచి కామెడీ ఎంటర్ టైనర్ సినిమాను మార్చాడు, దాంతో రొటీన్ కథనే అయినా కూడా సినిమా బాగా ఆకట్టుకుంటుంది, టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచం పట్టినా కూడా ఒక్కసారి కథలోకి ఎంటర్ అయిన తర్వాత సీన్ బై సీన్ మంచి కామెడీ సీన్స్ తో నిండిపోయి ఎండ్ కి వచ్చే సరికి తెరపై నటీనటులు అసలు మనకి తెలియక పోయినా కూడా….
సినిమా ఎండ్ అయ్యే టైంకి వాళ్ళు కూడా మనతో ట్రావెల్ అవుతున్నట్లు అనిపిస్తూ సినిమా ఎండ్ అవుతుంది, సంగీతం పర్వాలేదు అనిపించగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది… ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ స్టార్టింగ్ కొంచం టేక్ ఆఫ్ కి టైం పట్టినా కూడా…
తర్వాత నుండి ఎండ్ కార్డ్ వరకు కూడా సినిమా ఆడియన్స్ ను నవ్విస్తూ సాగుస్తుంది…. దాంతో ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది అని చెప్పొచ్చు. మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 3 స్టార్స్….రొటీన్ కథనే అయినా కూడా సినిమా ఎండ్ అయ్యే టైంకి ఆడియన్స్ ఓ మంచి ఎంటర్ టైనర్ చూసిన ఫీలింగ్ తో బయటికి వస్తారు…