సంక్రాంతి సినిమా ల దాటిని తట్టుకుని చాలా చిన్న సినిమాలు ఈ ఏడాది నిలవలేక పోయాయి. కొన్ని కొంచం ఎంటర్ టైనర్స్ గా అలరించే ప్రయత్నం చేసినా కానీ ఆడియన్స్ కొత్త సినిమాల కన్నా సంక్రాంతి సినిమాలనే చూడటానికి ఇష్టపడటం తో ఆ సినిమా లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక పోయాయి. 2020 లో రిలీజ్ అయిన సినిమాలే తక్కువ కాగా అందులో కొన్ని సినిమాలు ఎప్పుడు వచ్చేయో…
ఎప్పుడు వెళ్లి పోయాయో కూడా ఎవరికీ తెలియదు. అలా వచ్చి వెళ్లి పోయిన సినిమా లో మరో చిన్న సినిమా ప్రెజర్ కుక్కర్ అనే కామెడీ ఎంటర్ టైనర్ కూడా ఒకటి. కొన్ని బోర్ సీన్స్ మినహా సినిమా ఒక సారి చూసే విధంగా ఉంటుంది కానీ…
పోటి ని తట్టుకోలేక పోయిన ఈ సినిమా పరుగును చాలా త్వరగానే ముగించింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సుమారు 1 కోటి లోపు బడ్జెట్ తో రూపొందించగా థియేట్రికల్ బిజినెస్ మాత్రం 60 లక్షల రేంజ్ లో జరిగింది. సినిమా టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రలలో పాటు వరల్డ్ వైడ్ గా 80 లక్షల రేంజ్…
టార్గెట్ తో బరిలోకి దిగగా ఫైనల్ రన్ లో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 20 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని మిగిలిన చోట్ల మరో 2 లక్షల దాకా కలెక్షన్స్ ని అందుకుని టోటల్ గా 22 లక్షల రేంజ్ షేర్ ని అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును సినిమా ముగించిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సినిమా కి కొంచం పబ్లిసిటీ కూడా చేసినప్పటికీ ఫిబ్రవరి అన్ సీజన్ ఎఫెక్ట్ అండ్ సంక్రాంతి సినిమా ల బ్యాటింగ్ ఎదురుదెబ్బ తీయగా తర్వాత వచ్చిన భీష్మ కూడా తెరుకోనివ్వలేదు… దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును సినిమా డిసాస్టర్ రిజల్ట్ తోనే ముగించాల్సి వచ్చింది ఈ సినిమా కి.