Home న్యూస్ 2 ఏళ్లకి వస్తున్న KGF సినిమా….రేటు ఎంతో తెలిస్తే షాక్!!

2 ఏళ్లకి వస్తున్న KGF సినిమా….రేటు ఎంతో తెలిస్తే షాక్!!

0

రెండేళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి అల్టిమేట్ విజయాన్ని నమోదు చేసిన సినిమా KGF… పెద్దగా మార్కెట్ లేదని భావించే కన్నడ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీస్తూ మొట్ట మొదటి కర్ణాటక 200 కోట్ల సినిమా గా నిలిచిన KGF తెలుగు, తమిళ్ హిందీ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మెంటల్ మాస్ అనిపించే విజయాన్ని నమోదు చేసుకుంది.

దాంతో రెండో పార్ట్ పై ఎక్కడ లేనన్ని అంచనాలు ఇప్పుడు టోటల్ ఇండియా వైడ్ గా ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు ఆ సినిమా వస్తుందా అని ఆడియన్స్ అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక పక్క రెండో పార్ట్ కోసం ఎదురు చూస్తుండగా…. మరో పక్క మొదటి పార్ట్….

ఇప్పటి వరకు కూడా టెలివిజన్ లో టెలికాస్ట్ కాలేదు. సహజంగా హిట్ అయిన సినిమాలను ఎంత త్వరగా వేసి భారీ టి.ఆర్.పి లు సొంతం చేసుకోవాలని చూస్తుంటాయి టీవీ ఛానెల్స్. కానీ ఎందుకనో పాన్ ఇండియా లెవల్ లో సెన్సేషనల్ హిట్ అయిన KGF సినిమా శాటిలైట్ రైట్స్ కూడా తెలుగు లో అమ్ముడుపోలేదు.

చాలా లేట్ అయినా సినిమా ఎట్టకేలకు త్వరలో టెలివిజన్ లో టెలికాస్ట్ కి సిద్ధం అవుతుంది. టాలీవుడ్ లీడింగ్ ఛానెల్ అయిన స్టార్ మా ఈ సినిమా ను తెలుగు లో త్వరలో టెలికాస్ట్ చేస్తుండగా రేటు ఏంతా అనేది క్లియర్ గా రివీల్ చేయకున్నా కానీ ట్రేడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా కి తెలుగు శాటిలైట్ రైట్స్ కింద…

4.5 కోట్ల రేంజ్ రేటు దక్కిందని అంటున్నారు. ఇది KGF లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కి చాలా తక్కువ రేటు అనే చెప్పాలి. మంచి రేటు కి సినిమా ను సొంతం చేసుకున్న ఛానెల్ ఇప్పుడు సినిమా టెలికాస్ట్ తో సాలిడ్ టి.ఆర్.పి రేటింగ్స్ ని దక్కించుకోవాలని చూస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర చూపెట్టిన రాంపేజ్ సినిమా బుల్లితెర పై కూడా చూపుతుందో లేదో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here