బాక్స్ ఆఫీస్ దగ్గర విపరీతమైన అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్దం అవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ఈ సెన్సేషనల్ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా, అత్యంత భారీ ఎత్తున వరల్డ్ వైడ్ ఆ గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే…
సినిమా మీద అన్ని ఇండస్ట్రీలలో విపరీతమైన అంచనాలు ఉన్నాయి…అసలు పోటి లో మరే సినిమా కూడా ఇండియా వైడ్ గా లేదు…ఎపిక్ మమ్మోత్ బిజినెస్ ను సినిమా సొంతం చేసుకుంది…ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ క్రేజీ సినిమా కి సైతం సొంతం అవ్వని రేంజ్ లో…
అత్యంత భారీ టికెట్ హైక్స్ ఇప్పుడు పుష్ప2 కి సొంతం అయ్యాయి. దాంతో మొదటి రోజు అత్యంత భారీ రిలీజ్ తో పాటు మిడ్ నైట్ షోల నుండే గ్రాండ్ రిలీజ్ ఉండటంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ ను వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది…
కానీ సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ బాగున్నా….మరీ ఎగబడి చూసే రేంజ్ లో అయితే ఫుటేజ్ ను మేకర్స్ రిలీజ్ చేయలేదు…ఓవరాల్ గా సినిమాను తన భుజాన మోస్తూ అల్లు అర్జున్ అన్ని చోట్లా ప్రమోషన్స్ ని చేసి సినిమా హైప్ ను భారీగా పెంచేస్తున్నాడు…
కానీ ఇవన్నీ బాగున్నా తెలుగు రాష్ట్రాల్లో ఇంత భారీ బిజినెస్ రికవరీ అవ్వాలి అంటే రికార్డ్ ఓపెనింగ్స్ తో పాటు సాలిడ్ లాంగ్ రన్ ఎంతైనా అవసరం అని చెప్పాలి. కానీ ఇప్పటి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఏమి మరీ అంట ఎక్సైట్ ఏమి పరచకపోవడం…సోషల్ మీడియాలో….
మెగా Vs అల్లు అర్జున్ ఫ్యాన్ వార్స్ ఓ రేంజ్ లో జరుగుతూ ఉండటంతో…టాక్ ఏమాత్రం మిక్సుడ్ గా వచ్చినా కూడా ఓ రేంజ్ లో ఆ టాక్ సోషల్ మీడియాలో ఆఫ్ లైన్ లో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది….దానికి తోడూ టికెట్ హైక్స్ మరీ ఎక్కువగా ఉండటంతో…
ఫ్యామిలీ ఆడియన్స్, కామన్ ఆడియన్స్ ఎగబడి సినిమా చూసే విషయంలో కొంచం వెనకడు వేసే అవకాశం ఉంది….ఇది అస్సలు జరగకూడదు అనే అందరూ కోరుకుంటున్నారు…..కానీ టీం కానీ అల్లు అర్జున్ కానీ సినిమా ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. మరి వాళ్ళ నమ్మకం ఎంతవరకు నిజం అయ్యి మమ్మోత్ బిజినెస్ ను పుష్ప2 రికవరీ చేయగలుగుందో లేదో చూడాలి ఇప్పుడు.