బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ఊరమాస్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) మూడు వారాలను రిమార్కబుల్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది. కాగా సినిమా 21వ రోజున క్రిస్టమస్ హాలిడే లో..
అన్ని చోట్లా కుమ్మేయగా హిందీలో మరింత జోరు ని చూపించింది సినిమా…కాగా క్రిస్టమస్ హాలిడేలో స్ట్రైట్ హిందీ కొత్త సినిమా మంచి బజ్ నడుమ రిలీజ్ అయినా కూడా జనాలు పుష్ప2 మూవీ కే ఓటు వేశారు ఇప్పుడు. వరుణ్ ధవన్ హీరోగా నటించిన…
బేబీ జాన్(Baby John Movie) మూవీ మంచి హైప్ నడుమ రిలీజ్ అయ్యి ఒరిజినల్ తెరీ చూడని వాళ్ళ నుండి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో కుమ్మేస్తుంది అనుకున్నా కూడా మొత్తం మీద మొదటి రోజు కలెక్షన్స్ ఇప్పుడు…
పుష్ప2 సినిమా 21వ రోజు కలెక్షన్స్ కన్నా తక్కువగా రావడం అందరినీ ఆశ్యర్యపరిచింది ఇప్పుడు….బేబీ జాన్ మూవీ మొదటి రోజు హిందీలో 12 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు అంచనా…అదే టైంలో పుష్ప2 మూవీ మాస్ ఊచకోత కోస్తూ దుమ్ము లేపగా….
21వ రోజు కలెక్షన్స్ 15 కోట్లకు పైగానే ఉంటాయని అంచనా…దాంతో పుష్ప2 21వ రోజు కలెక్షన్స్ మొదటి రోజు బేబీ జాన్ మూవీ కలెక్షన్స్ కన్నా ఎక్కువగా ఉండటం చూసి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్యర్యపోతున్నారు…సినిమా ఊపు చూస్తూ ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర….
ఈ వీకెండ్ లో బేబీ జాన్ మీద సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…డబ్బింగ్ మూవీస్ పరంగా బిగ్గెస్ట్ రికార్డ్ ను అందుకున్న పుష్ప2 ఇప్పుడు బాలీవుడ్ మూవీస్ పరంగా ఆల్ టైం ఎపిక్ బెంచ్ మార్క్ ని సెట్ చేస్తూ దూసుకు పోతుంది ఇప్పుడు.