Home న్యూస్ చిన్న కొండ పుష్పక విమానం ట్రైలర్…కుమ్మిందిగా ట్రైలర్!!

చిన్న కొండ పుష్పక విమానం ట్రైలర్…కుమ్మిందిగా ట్రైలర్!!

0

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఆడియన్స్ ముందుకు దొరబాబు సినిమాతో హీరోగా పరిచయం అయినా ఆ సినిమా నిరాశ పరిచింది కానీ తర్వాత చేసిన మిడిల్ క్లాస్ మెలోడిస్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సింది డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ అయ్యి డిజిటల్ హిట్ గా నిలిచింది, ఇక ఇప్పుడు తననుండి వస్తున్న కొత్త సినిమా పుష్పక విమానం ఆడియన్స్ ముందుకు నవంబర్ 12 న రిలీజ్ కాబోతుంది.

ఇక సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా అల్లు అర్జున్ తో రిలీజ్ చేయించగా ట్రైలర్ చూస్తుంటే సినిమా హిట్టు అయ్యే కళ కనిపిస్తుంది అని చెప్పాలి. పెళ్లి అయిన తర్వాత సిటీకి వచ్చిన హీరో తన వైఫ్ కొన్ని రోజులకే ఇంట్లో నుండి పారిపోయింది అని తెలిసి తర్వాత సమాజంలో….

తనని ఏమనుకుంటారో అని కొంత టైం కవర్ చేయాలనీ ట్రై చేసినా తర్వాత అందరికీ తెలుస్తుంది, తర్వాత ఏం అయింది, ఇంతకీ పెళ్లి కూతురు ఎందుకు పారిపోయింది అన్నది అసలు కథ. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటం ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉండటంతో ఈ సారి చిన్న కొండ బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టే ఛాన్స్ ఎంతైనా ఉందనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here