బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆ సినిమా ల తర్వాత భారీ క్రేజ్ నడుమ వచ్చిన సాహో సినిమా డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ ఓవరాల్ గా సెన్సేషనల్ కలెక్షన్స్ ని దక్కించుకుని దుమ్ము దులిపేశాడు. హిందీ లో అయితే డిసాస్టర్ టాక్ తోనే అక్కడ సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా…
అక్కడ ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్యర్యపోయేలా చేసింది, అలాంటి విజయం తర్వాత మరో మాస్ మూవీ చేయాల్సిన ప్రభాస్ కంప్లీట్ గా ఒక్కటంటే ఒక్క యాక్షన్ సీన్ కూడా లేకుండా ప్యూర్ లవ్ స్టొరీతో రాధే శ్యామ్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు… కొంచం బాలీవుడ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని…
ఈ సబ్జెక్ట్ ని ఓకే చేశాడని అనిపించడం కూడా కామన్ అని చెప్పొచ్చు ఈ సినిమా విషయంలో… యూనిక్ కాన్సెప్ట్ తో కంప్లీట్ లవ్ స్టొరీగా వచ్చిన ఈ సినిమా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఔట్ రైట్ రిజెక్ట్ గా మిగిలి పోయింది…
హిందీ ఆడియన్స్ ప్రభాస్ నుండి యాక్షన్ మూవీనే ఎదురు చూడటం, ఈ లవ్ స్టొరీ పెద్దగా ఆసక్తి కలిగించక పోవడం, దానికి తోడూ ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా సంచలన రికార్డ్ కలెక్షన్స్ జోరులో రాధే శ్యామ్ తేరుకోలేక పోయింది… హిందీ టోటల్ బిజినెస్ వాల్యూ 50 కోట్ల రేంజ్ లో ఉండగా బ్రేక్ ఈవెన్ కోసం 110 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ టార్గెట్ తో…
బరిలోకి దిగిన రాధే శ్యామ్ టోటల్ రన్ లో 22.25 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా షేర్ 10.68 కోట్ల మార్క్ ని అందుకుంది… టోటల్ గా బిజినెస్ లో 39.32 కోట్లు నష్టపోయిన సినిమా బిజినెస్ వైజ్ వన్ ఆఫ్ బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీస్ లో ఒకటి గా నిలిచింది అని చెప్పొచ్చు హిందీ లో… సాహో లాంటి డిసాస్టర్ తో హిట్ కొట్టిన ప్రభాస్ కి ఈ లవ్ స్టొరీ అసలు ఏమాత్రం కలిసి రాలేదు అని చెప్పొచ్చు బాక్స్ ఆఫీస్ దగ్గర…