Home న్యూస్ వీళ్ళు మారరు…ఒరేయ్ బుజ్జిగా లోకల్ ఛానెల్ లో….దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జీ తెలుగు!!

వీళ్ళు మారరు…ఒరేయ్ బుజ్జిగా లోకల్ ఛానెల్ లో….దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జీ తెలుగు!!

0

కోట్లు కోట్లు పెట్టి OTT యాప్స్ అండ్ టెలివిజన్ ఛానెల్స్ ఇప్పుడు సినిమాలను కొంటుంటే పైరసీ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు… ముఖ్యంగా లోకల్ ఛానెల్స్ కొత్త సినిమాలు వచ్చింది వచ్చినట్లు పైరసీ లో మాస్టర్ ప్రింట్ ని డౌన్ లోడ్ చేసుకుని తమ ఛానెల్స్ లో టెలికాస్ట్ చేస్తూ ఉండగా… నిర్మాతలు సినిమా ను కొన్న ఛానెల్ వాళ్ళు ఎన్ని ఫైన్స్ ఇచ్చినా కానీ పెద్దగా పట్టించు కోవడం లేదు…

రీసెంట్ గా అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా రిలీజ్ టైం లో ఇలానే జరగగా టీం అండ్ అమెజాన్ నుండి కూడా ఓ లోకల్ ఛానెల్ కి ఫైన్ కట్టండి అంటూ నోటిసులు వెళ్ళగా…. నిశ్శబ్దం కన్నా కొన్ని గంటల ముందు టెలికాస్ట్ అయిన మరో కొత్త సినిమా…

ఒరేయ్ బుజ్జిగా కూడా వచ్చిన రోజునే లోకల్ ఛానెల్స్ లో టెలికాస్ట్ చేశారట. కాగా ఒక లోకల్ ఛానెల్ లో సినిమా వేశారు అన్న విషయం తెలుసుకున్న సినిమా శాటిలైట్ రైట్స్ ని కొన్న జీ తెలుగు వాళ్ళు ఈ సారి చిన్న సినిమానే అయినా పెద్ద ఫైన్ వేసి షాక్ ఇచ్చారు లోకల్ ఛానెల్ కి…

సినిమా ను త్వరలోనే టెలికాస్ట్ చేసే ప్లాన్ లో ఉన్న జీ తెలుగు వాళ్లకి ఈ సినిమా ఇలా లోకల్ ఛానెల్ లో టెలికాస్ట్ అని తెలిసి 1 కోటి ఫైన్ కట్టండి అంటూ నోటిసులు పంపారట. సినిమాను ఛానెల్ కొన్నది 1.8 కోట్లే అయినా ఏకంగా 1 కోటి రేంజ్ ఫైన్ వేయడం ట్రేడ్ లో కొంచం షాకింగ్ గానే ఉన్నా…

లోకల్ ఛానెల్ కి చేసిన పనికి ఇదే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారు, ఎన్ని ఫైన్స్ వేస్తున్నా కానీ లోకల్ ఛానెల్స్ ఏమి పట్టించుకోకుండా సినిమాల టెలికాస్ట్ ని మాత్రం ఆపకపోవడం మాత్రం షాకింగ్ గా మారింది అని చెప్పాలి. ఫైన్స్ కట్టడం వీళ్ళకి ఇంత తేలిక అవుతుందా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here