Home టోటల్ కలెక్షన్స్ రాజ్ తరుణ్ కెరీర్ లోనే ఆల్ టైం ఎపిక్ రికార్డ్…2.1 కోట్లకు వచ్చింది ఇది!

రాజ్ తరుణ్ కెరీర్ లోనే ఆల్ టైం ఎపిక్ రికార్డ్…2.1 కోట్లకు వచ్చింది ఇది!

0

కెరీర్ మొదలు పెట్టడం అద్బుతంగా మొదలు పెట్టి తర్వాత వరుస ఫ్లాఫ్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర తన మార్కెట్ ని చాలా వరకు తగ్గించుకుని లాస్ట్ ఇయర్ ఒరేయ్ బుజ్జిగా మినిమమ్ ఇంపాక్ట్ ని చూపినా ఈ ఇయర్ రాజ్ తరుణ్ చేసిన సినిమా పవర్ ప్లే అసలు రిలీజ్ అయిన విశ్సయం కూడా తెలియదు, అలాంటి సినిమాకి కూడా బిజినెస్ బాగానే జరిగినా బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వేవ్ కన్నా ముందు భారీ డిసాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా…

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ డిసాస్టర్ అయ్యింది, సినిమా ట్రేడ్ లెక్కల ప్రకారం 1.9 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో 13 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా తర్వాత వర్కింగ్ డేస్ లో నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకుని…

సినిమా పరిస్థితి ఎలా మారింది అంటే… పట్టు మని 5 రోజులు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలవలేక పరుగును ముగించాల్సి వచ్చింది, థియేటర్స్ నుండి ఈ సినిమాను తొలగించి వేరే పాత సినిమాను వేశారు థియేటర్ ఓనర్స్.. ఇక మొత్తం మీద డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని తీయకుండా సినిమా టోటల్ గా…

15 లక్షల రేంజ్ లో ఓవరాల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని తీస్తే పట్టుమని 5 లక్షలు కూడా షేర్ సాధించలేక పోయింది ఈ సినిమా, ఇలా ప్రమోషన్స్ లాంటివి చేయకుండా ఉండాలని ఫిక్స్ అయితే సినిమాను డిజిటల్ రిలీజ్ చేసుకోవడం మంచిది, ఇలా సినిమాను జనాలు చూడాలని రిలీజ్ చేయడం,

అసలు ఆ విషయం జనాలకు కూడా తెలియకపోవడం చాలా విచారకరం అని చెప్పొచ్చు. సినిమా తో మొత్తం మీద తన కెరీర్ లోనే ఏ సినిమా కి రానంత నెగటివ్ షేర్ ని ఈ సినిమాతో సొంతం చేసుకున్నాడు రాజ్ తరుణ్, దాంతో ఈ సినిమా తన కెరీర్ లో ఒక ఎపిక్ డిసాస్టర్ మూవీ గా నిలిచిపోతుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here