Home న్యూస్ ఎన్టీఆర్ ‘దేవర’ కొత్త రిలీజ్ డేట్….4 రోజలు రికార్డుల జాతరే!

ఎన్టీఆర్ ‘దేవర’ కొత్త రిలీజ్ డేట్….4 రోజలు రికార్డుల జాతరే!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) సోలో హీరోగా అరవింద సమేత(Aravindha Sametha) సినిమా తర్వాత చేస్తున్న సినిమా దేవర పార్ట్ 1(Devara Part 1)….మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) తో కలిసి చేసిన ఎపిక్ RRR మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకోగా ఆ సినిమా తర్వాత…

ఎన్టీఆర్ కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్ లో చేస్తున్న దేవర సినిమా మీద అంచనాలు సాలిడ్ గా ఉండగా సినిమాను ముందుగా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని అనుకున్నా కూడా సినిమా షూటింగ్ పెండింగ్ వర్క్ వలన సినిమా పోస్ట్ పోన్ అవ్వగా సెకెండ్ ఆఫ్ కి సినిమా రిలీజ్ షిఫ్ట్ అయినా కూడా…

ఇతర బిగ్ మూవీస్ ఆల్ రెడీ బెస్ట్ డేట్స్ ను సెట్ చేసుకోవడంతో ఇప్పుడు కొత్త డేట్ ను వెతికే పనిలో ఉన్న దేవర అఫీషియల్ గా కొత్త డేట్ ను కన్ఫాం చేసుకుంది. దసరా కానుకగా సినిమా ఇప్పుడు అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు…

కాగా సినిమా రిలీజ్ డేట్ 10న నార్మల్ డే నే అయినా సినిమా రికార్డ్ ఓపెనింగ్స్ ను అందుకోవచ్చు, ఇక 11 నుండి 13 వరకు వీకెండ్ అండ్ దసరా హాలిడేస్ కూడా సినిమాకి కలిసి వస్తూ ఉండటంతో అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా మొదటి 4 రోజుల్లో రికార్డ్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here