సీనియర్ హీరో రాజశేఖర్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది, రీసెంట్ టైం లో గరుడ వేగ, కల్కి లాంటి మంచి సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినా కానీ ఆ సినిమాలు ఆడియన్స్ ను అనుకున్న రేంజ్ లో అయితే థియేటర్స్ కి రప్పించ లేక పోయాయి. ఇలాంటి టైం లో అనుకోకుండా ఎప్పుడో ఆడియన్స్ ముందుకు రావాల్సిన రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో చేసిన పట్టపగలు సినిమా…
పేరు మార్చుకుని దెయ్యం పేరుతొ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లో దిగగా సినిమాను ఏకంగా 280 వరకు థియేటర్స్ లో రిలీజ్ చేశారు. చాలా సెంటర్స్ లో ఓన్ రిలీజ్ అయినా మొత్తం మీద బిజినెస్ ఓ 30 లక్షల దాకా చేసింది ఈ సినిమా.
ఇక రిలీజ్ అయిన సినిమా చూసిన వాళ్ళు కొందరు తలలు పట్టుకు కూర్చున్నారు. కేవలం 1 గంటా 40 నిమిషాల లోపు మాత్రమే లెంత్ ఉన్న ఈ సినిమా కథ పాయింట్ చాలా సింపుల్, హీరో కూతురుకి అనుకోకుండా ఒక ఆత్మ ఆహహించి కొందరిని చంపుతుంది. దానికి కారణం ఏంటి… ఎందుకు చంపుతుంది…
తన కూతురిని హీరో ఎలా కాపాడుకున్నాడు అన్నది సినిమా కథ.. ఇలాంటి రొట్టకొట్టుడు కథలు ఎన్నో ఎన్నోన్నో వచ్చాయి. రామ్ గోపాల్ వర్మ మళ్ళీ అదే కథతో వచ్చినప్పటికీ ఈ సారి ప్రొడక్షన్ వాల్యూస్, డబ్బింగ్ అత్యంత నాసిరకంగా ఉన్నాయని అంటున్నారు. దాంతో సినిమా చూసిన వాళ్ళు వరస్ట్ మూవీ అంటూ చెబుతుండగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు…
కేవలం 2 లక్షల రేంజ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుందని అంటున్నారు. చాలా చోట్ల ఆక్యుపెన్సీ లేక డెఫిసిట్ లు పడటం తో షోలు ఆపేశారట. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో 30 లక్షల రేంజ్ లో అమ్మగా 50 లక్షల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఏ దశలో కూడా ఆ మొత్తాన్ని అందుకోవడం అసాధ్యం అనే చెప్పాలి. మరి ఈ అసాధ్యాన్ని సినిమా ఏమైనా సుసాధ్యం చేసే అవకాశం ఉందా చూడాలి ఇక.