Home న్యూస్ దేవర 1st సాంగ్ రివ్యూ….హైప్ ని అందుకుందా….లేదా!!

దేవర 1st సాంగ్ రివ్యూ….హైప్ ని అందుకుందా….లేదా!!

0

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(JR NTR) RRR లాంటి బిగ్ పాన్ ఇండియా సక్సెస్ తర్వాత చేస్తున్న సినిమా దేవర(Devara Part 1 Movie)…ఆచార్య(Acharya) తో భారీ ఫ్లాఫ్ అందుకున్న కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మీద ఆడియన్స్ లో భారీ ఆశలు ఉన్నాయి. గట్టిగా చెప్పాలి అంటే ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సోలో మూవీ ఇది…

అక్టోబర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ అయిన ఫియర్ సాంగ్(Fear Song -Devara Part 1) ను ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేశారు. అనిరుద్(Anirudh Ravichander) మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ రీసెంట్ ట్రెండింగ్ సాంగ్ అయిన హుకుం సాంగ్ కన్నా కూడా ఓ రేంజ్ లో ఉంటుంది అంటూ హైప్ ను ఓ రేంజ్ లో పెంచారు…

మరి ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన దూకే ధైర్యమా జగ్రత్తా-దేవర ముందర మీరెంత అంటూ లిరిక్స్ తో వచ్చిన ఫియర్ సాంగ్ ఫస్ట్ టైం విన్నప్పుడే చాలా బాగా అనిపించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు, అనిరుద్ ఎక్స్ లెంట్ మ్యూజిక్, రిచ్ విజువల్స్ సాంగ్ కి హైలెట్ గా నిలవగా యాక్షన్ సీన్స్ అండ్ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ ఎక్స్ లెంట్ గా ఉందని చెప్పొచ్చు….

లిరిక్స్ కూడా బాగా ఆకట్టుకోగా ఓవరాల్ గా సాంగ్ బాగుంది అని చెప్పాలి. కానీ అదే టైంలో హుకుం సాంగ్ ని మించిపోయిందా అంటే మాత్రం ఆల్ రెడీ హుకుం సాంగ్ విని విని ఉన్న ఆడియన్స్ కి ఫియర్ సాంగ్ ఫస్ట్ టైం విన్నప్పుడు ఆ రేంజ్ ను అందుకోలేకపోయింది అనే అంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు…

ఇలా వేరే సాంగ్ తో కంపేర్ చేయకుండా ఉండి ఉంటే ఫియర్ సాంగ్ ఓవరాల్ గా యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని ఉండేది, కానీ కంపారిజన్స్ వలన కొంచం హైప్ ను అందుకోలేదు అనిపించింది, కానీ కంపేర్ చేయకుండా వింటే మాత్రం ఇన్ స్టంట్ గా ఎక్కేస్తుంది అని చెప్పొచ్చు… ఇక సాంగ్ కి 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here