సూపర్ స్టార్ రజినీకాంత్ అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో అద్బుతమైన కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది. సినిమా మొదటి రోజు నైజాం ఏరియాలో 4.75 కోట్ల షేర్ ని అందుకోగా రెండో రోజు అఫీషియల్ లెక్క 2.8 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
మూడో రోజు కూడా అల్టిమేట్ లెవల్ లో హోల్డ్ చేసి టోటల్ గా 2.9 కోట్ల షేర్ ని అందుకోగా మూడు రోజుల లెక్క 10 కోట్ల మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. రజినీకాంత్ కెరీర్ లో నైజాం ఏరియా లో ఇది రెండో 10 కోట్ల సినిమా గా చెప్పుకోవచ్చు.
ఇది వరకు రోబో ఇక్కడ 14.8 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా సీక్వెల్ లో రజినీ ఇక్కడ 10 కోట్ల మార్క్ ని అందుకున్నాడు. వీకెండ్ ముగిసే లోపు ఇక్కడ 13 కోట్ల మార్క్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుందని చెప్పొచ్చు.