సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ దగ్గర తనదైన రేంజ్ మ్యాజిక్ చేసి చాలా కాలమే అవుతుంది, రోబో సినిమా తర్వాత రజినీ చేసిన సినిమాలకు హైప్ అయితే విపరీతంగా ఉంటూ వస్తుంది కానీ ఆ రేంజ్ విజయం మాత్రం దక్కలేదు అనే చెప్పాలి. పేట మరియు దర్బార్ లు పర్వాలేదు అనిపించినా కానీ రజినీ రేంజ్ విజయాలు అయితే కావు… ఇక తెలుగు లో అయితే రజినీ నటించిన సినిమాలు అన్నీ…
ఒక్క 2.0 తప్పితే మిగిలినవి బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు అంచనాలను కూడా అందుకోలేక పోయాయి. రీసెంట్ గా వచ్చిన పెద్దన్న సినిమా రజినీకి కంబ్యాక్ మూవీగా నిలుస్తుంది అని అంతా అనుకున్నారు కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచింది…
ఇలాంటి టైం లో రజినీ అప్ కమింగ్ మూవీ ఏది అయి ఉంటుంది అన్నది ఆసక్తిగా మారగా కోలివుడ్ లో ఇక రజినీకాంత్ కొత్త సినిమాలు ఏమి సైన్ చేయడం లేదని, పెద్దన్న సినిమానే లాస్ట్ మూవీ అంటూ వార్తలు ప్రచారం లోకి రాగా వాటికి పులిస్టాప్ పెట్టడానికి రజినీకాంత్ ఇప్పుడు కొత్త సినిమాను..
ఆల్ మోస్ట్ కన్ఫాం చేశారు అన్న వార్తలు చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తూ ఉన్నాయి…. ఆ వార్తల ప్రకారం ప్రజెంట్ కోలివుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారిన నెల్సన్ తో రజినీ అప్ కమింగ్ మూవీ ఉంటుంది అంటున్నారు. డాక్టర్ తో 100 కోట్ల డైరెక్టర్ గా మారిన నెల్సన్ ఇప్పుడు విజయ్ తో బీస్ట్ మూవీ ఫినిష్ చేసే పనిలో ఉండగా…
సమ్మర్ లో ఆ సినిమా పూర్తీ కాబోతుండగా ఆ సినిమా తర్వాత రజినీతో తన స్టైల్ లో ఓ కామెడీ అండ్ స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ న్యూస్ ఆల్ మోస్ట్ కన్ఫాం అని అంటూ ఉండటంతో సూపర్ స్టార్ ఈ సినిమాతో సెన్సేషనల్ కంబ్యాక్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…