బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా చేసిన సినిమాల్లో రిలీజ్ కి ముందు మంచి పాజిటివ్ బజ్ ని సొంతం చేసుకున్న సినిమాగా రాక్షసుడు మంచి క్రేజ్ ని సొంతం చేసుకోగా నేడు ప్రేక్షకుల ముందుకు భారీ ఎత్తున వచ్చేసిన ఈ సినిమా సుమారు గా 830 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ముందుగా ఓవర్సీస్ ప్రీమియర్ షో లను పూర్తీ చేసుకున్న ఈ సినిమా కి అక్కడ నుండి ఫస్ట్ టాక్ బయటికి వచ్చేసింది.
ఆ టాక్ ప్రకారం సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.. ముందుగా స్టొరీ లైన్ విషయానికి వస్తే డైరెక్టర్ కాబోయి పోలిస్ అయిన హీరో ఒక సైకో ని వెతుకుతూ ఉంటాడు, అమ్మాయిలను దారుణంగా చంపే ఆ సైకో ని హీరో ఎలా పట్టుకున్నాడు అన్నది ఓవరాల్ గా కథ పాయింట్.
కథ పాయింట్ సింపుల్ గా సింగిల్ లైన్ లో చెప్పేలా ఉన్నప్పటికీ మొదటి 10 నిమిషాల తర్వాత నుండి స్క్రీన్ ప్లే పక్కా పకడ్బందీగా ఉంటూ తర్వాత సీన్ ఏమవుతుందా అసలు సైకో పాత్ర ఎవరు అన్న ఆసక్తి తో సినిమా ఆద్యంతం కొనసాగుతూ ఉంటుంది. గిబ్రాన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటున్నారు.
ఇక బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఈ సినిమాలో ఆకట్టుకుంటాడని, అలాగే అనుపమ రోల్ కి తగ్గట్లు బాగా నటించిందని అంటున్నారు. సినిమాలో ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అయితే… ఒరిజినల్ లో ఉన్న సీన్స్ చాలా వరకు ఇక్కడ కూడా ఏలాంటి మార్పులు లేకుండా…
అవే సీన్స్ ని వాడేశారని, దాంతో ఒరిజినల్ చూసిన వాళ్ళ కి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందని అంటున్నారు, ఆ ఒక్కో మైనస్ తప్పితే సినిమా అద్బుతంగా ఉందని ఓవర్సీస్ ఆడియన్స్ చెబుతున్నారు. ఓవరాల్ గా ఓవర్సీస్ ఆడియన్స్ నుండి సూపర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రెగ్యులర్ షోలకు ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.