రానా దగ్గుబాటి బాహుబలి సిరీస్ తర్వాత ఒప్పుకున్న సినిమాలు చాలానే ఉన్నప్పటికీ ఆడియన్స్ ముందుకు కొద్ది సినిమాలు మాత్రమే వస్తూ ఉన్నాయి. ఈ ఇయర్ మొదట్లో లేట్ గా రిలీజ్ ను సొంతం చేసుకున్న అరణ్య సినిమా భారీ నిరాశని మిగిలించగా ఈ సినిమా తర్వాత రానా నుండి విరాట పర్వం సినిమా రావాల్సి ఉంది కానీ అది ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేకుండా పోయింది… ఇక మూడేళ్ళ క్రితం రానా…
చాలా వరకు షూటింగ్ చేసి నిర్మాతతో కొన్ని ఇంసిడెంట్ల వలన 1945 అనే సినిమా నుండి తప్పుకోగా ఆ సినిమా అప్పటి నుండి పోస్టర్స్ లో తప్పితే పెద్దగా పేరు కూడా ఎక్కడా వినిపించలేదు, కానీ సడెన్ గా ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు న్యూ ఇయర్ కానుకగా….
రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు కానీ ఎందుకో మళ్ళీ పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఇప్పుడు జనవరి 7న రిలీజ్ అవ్వడానికి సిద్దం అవ్వగా ఈ సినిమా కి నాకు ఎలాంటి సంభందం లేదంటూ రానా ఆల్ రెడీ క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్ గా సినిమా ట్రైలర్ రిలీజ్ అంటూ హడావుడి చేసినా…
తెలుగు లో రిలీజ్ చేయకుండా తమిళ్ లో ట్రైలర్ ని రిలీజ్ చేశారు. కానీ తెలుగు లో రిలీజ్ ప్లానింగ్ మాత్రం సాలిడ్ గానే ఉండగా ఒక్క నైజాంలోనే సినిమా 150 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా సీడెడ్ లో 50 వరకు ఆంధ్రలో 150 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది, టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ఇప్పుడు మొత్తం మీద…
350 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది, అసలు ట్రైలర్ లేదు, రిలీజ్ అవుతుంది అన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియదు… 3 ఏళ్ళుగా ఆగిపోయిన సినిమా సడెన్ గా ఇన్ని థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం. తమిళ్ ట్రైలర్ అయితే ఆకట్టుకుంది అని చెప్పొచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.