బాహుబలి తర్వాత ప్రభాస్ భారీ సినిమాలతో పాన్ ఇండియా లెవల్ లో దూసుకు పోతుంటే, అంతకన్నా ముందే తన రేంజ్ లో పాన్ ఇండియా మూవీస్ ని చేసిన హీరో రానా మాత్రం కొన్ని వ్యక్తిగత కారణాల వలన కొంచం స్లో డౌన్ అయ్యాడు, కానీ అప్పటికే రానా మొదలు పెట్టిన సినిమాలు సాలిడ్ గా ఉండగా వాటిని ఒక్కొటిగా ఇప్పుడు పూర్తీ చేసే పనిలో ఉన్నాడు రానా దగ్గుబాటి, అలాంటి సినిమాలలో ఒకటి విరాట పర్వం…
టైటిల్ తోనే సినిమా పై ఆసక్తిని రేపెలా చేసిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి లాంటి మంచి స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ని రీసెంట్ గా రానా పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేయగా సినిమా కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.
సినిమా పై ఆడియన్స్ లో కూడా ఆసక్తి మొదలు అవ్వగా సినిమా వచ్చే సమ్మర్ లోనే ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని సమచారం. పూర్తిగా అన్నల నేపధ్యంలో అడవుల్లో షూటింగ్ ఎక్కువగా జరిగే కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ని ముందు తక్కువ బడ్జెట్ లోనే తెరకేక్కించాలి అని భావించినా కానీ..
సినిమా లేట్ అవుతూ రావడం క్వాలిటీ మెయిన్ టైన్ చేస్తూ రావడం తో సినిమా బడ్జెట్ పెరిగిందని అంటున్నారు. తెలుగు లో రూపొందుతున్న ఈ సినిమా ఇతర భాషల్లో కూడా డబ్ కానుంది, దాంతో బడ్జెట్ పెరిగినా అన్ని చోట్ల బిజినెస్ తో రికవరీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ముందు 20 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో సినిమా ను రూపొందించాలి అని భావించినా అది పెరిగి…
మొత్తం మీద ఇప్పుడు 35 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో సినిమా తెరకేక్కుతుందని అంటున్నారు. రానా కి అన్ని ఇండస్ట్రీలలో డీసెంట్ మార్కెట్ ఉండటం బాహుబలి తో తన పై ఆడియన్స్ లో క్రేజ్ ఉండటం తో సినిమా ఆ బడ్జెట్ ని రికవరీ చేస్తుందని అంతా భావిస్తున్నారు. ఇక రానా నటించిన పాన్ ఇండియా మూవీ అరణ్య సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది.