బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చ్ 26 న రెండు సినిమాలు పోటి పడబోతున్నాయి. రానా దగ్గుబాటి చాలా టైం గ్యాప్ తర్వాత అరణ్య సినిమా తో వస్తుండగా చెక్ ఫ్లాఫ్ తర్వాత నితిన్ ఎలా గైనా హిట్ కొట్టాలి అన్న కసితో రంగ్ దే సినిమా తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అయ్యాడు. కాగా ఈ రెండు సినిమాలు కూడా రెండు తెలుగు రాష్ట్రాల లో సాలిడ్ గా రిలీజ్ కానున్నాయి.
రెండు సినిమాల థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే ముందుగా నితిన్ రంగ్ దే సినిమా కొంచం ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ కానుంది, కారణం ఎంటర్ టైన్ మెంట్ ఎక్కువ ఉండటం అండ్ ఫ్యామిలీ మూవీ కాబట్టి అని చెప్పాలి. నైజాం లో ఈ సినిమా 233 థియేటర్స్ లో రిలీజ్ కానుండగా,
సీడెడ్ లో 120 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది, ఇక టోటల్ ఆంధ్రాలో ఈ సినిమా 260 థియేటర్స్ లో రిలీజ్ కానుంది, దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 613 థియేటర్స్ లో రిలీజ్ కానుంది, ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 110 థియేటర్స్ లో ఒవర్సీస్ లో 180 లోకేషన్స్ లో రిలీజ్ కానుంది.
దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా 800 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతుంది, ఇక అరణ్య సినిమా నైజాం లో 126 థియేటర్స్ లో సీడెడ్ లో 75 థియేటర్స్, ఆంధ్రలో 200 థియేటర్స్ లో రిలీజ్ కానుండగా రెండు తెలుగు రాష్ట్రాలలో 400 థియేటర్స్ లో రిలీజ్ కానుంది, తమిళ్ వర్షన్ 180 థియేటర్స్ లో, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ కర్ణాటక లో 120 థియేటర్స్ లో… ఓవర్సీస్ లో…
170 లోకేషన్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా…870 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది, మరి ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటాయి కలెక్షన్స్ ఎలా ఉంటాయి అన్నది ఆసక్తిగా మారింది అని చెప్పొచ్చు.