చాలా టైం గ్యాప్ తర్వాత కృష్ణవంశీ నుండి వస్తున్న సినిమా రంగమార్తాండ… మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ సినిమా తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా పై పెద్దగా బజ్ అయితే లేదు, దాంతో మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ అయిన రంగమార్తాండ సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుంది, కృష్ణవంశీకి కంబ్యాక్ మూవీ గా నిలిచిందో లేదో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే… దిగ్గజ రంగస్థల నటుడు అయిన ప్రకాష్ రాజ్ రంగస్థలం నుండి ఇక రిటైర్ మెంట్ తీసుకుని తన ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని అనుకుంటాడు….
తన ఆసక్తిని భాగాలుగా చేసి తన పిల్లలకు పంచుతాడు.. ఈ ఆస్తి పంపకాలను తన భార్య రమ్యకృష్ణ వద్దని చెప్పినా చేసిన ప్రకాష్ రాజ్ ఆస్తి పంపకాల తర్వాత ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు, తన ఫ్రెండ్ బ్రహ్మానందంతో తన స్నేహ జీవితం ఎలా సాగింది లాంటి విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… ముందుగా కథగా చెప్పాలి అంటే ఇలాంటి కథలను మనం ఎన్నో ఆల్ రెడీ చూసి చూసి ఉన్నాం… కానీ ఇక్కడ మాత్రం స్పెషల్ ఏంటి అంటే మాత్రం…
నటీనటుల అద్బుతమైన నటన… ఆ యాక్టింగ్ స్కిల్స్ తో రొటీన్ కథగా అనిపించినా అద్బుతమైన నటన తెరపై అలా చూస్తూ ఉండేలా చేస్తుంది, ఫస్టాఫ్ కథ కొంచం సో సోగా సాగినా సెకెండ్ ఆఫ్ లో మెలో డ్రామా, బ్రహ్మానందంతో ప్రకాష్ రాజ్ హాస్పిటల్ సీన్స్ అద్బుతంగా మెప్పిస్తాయి…. ప్రకాష్ రాజ్ కానీ రమ్యకృష్ణ కానీ ఆ పాత్రల్లో జీవించేశారు. ఇక బ్రహ్మానందం నుండి ఈ రేంజ్ నటన చూసి ప్రతీ ఒక్కరు ఆశ్యర్యపోవడం ఖాయం….
సంగీతం పర్వాలేదు అనిపించగా, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా సాగుతుంది, లెంత్ కూడా ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది, రొటీన్ స్టొరీ పాయింట్ అవ్వడం లాంటివి సినిమాకి మైనస్ పాయింట్స్… కానీ వీటిని ఓపిక పట్టి చూస్తె మట్టుకు రంగమార్తాండ ఎండ్ అయ్యి థియేటర్స్ బయటికి వచ్చే ఆడియన్స్, ఒక సంసారం ఒక చదరంగం, ఆ నలుగురు లాంటి మంచి సినిమా చూశాం అనిపిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత…
కృష్ణవంశీ రీసెంట్ టైంలో చేసిన సినిమాల్లో ఓ మంచి సినిమాగా ఈ సినిమా నిలుస్తుంది… ప్రధాన పాత్రల అద్బుత నటనతో మెప్పించిన రంగమార్తాండ, మైనస్ లు, ఫ్లాస్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాలని ఒకసారి అయినా చూసి తీరాల్సిందే.. కానీ లెంత్ కొంచం తగ్గించి, కొంచం టైట్ స్క్రీన్ ప్లే తో కథని నడిపి ఉంటే ఎలాంటి వంక పెట్టకుండా మెప్పించేది ఈ సినిమా.. అయినా కానీ కొంచం ఓపికతో చూస్తె కచ్చితంగా మెప్పించే రంగమార్తాండ కి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…
You don’t know how to make movies. You don’t know anything screenplay or anything about movie. How dare are you giving ratings for movies.