Home న్యూస్ 102 కోట్ల బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా….షోలు కాన్సిల్ అవ్వడం ఏంటి సామి!

102 కోట్ల బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా….షోలు కాన్సిల్ అవ్వడం ఏంటి సామి!

0

లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మార్క్ ఆంటోని(Mark Antony Movie) సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టిన విశాల్(Vishal) ఆల్ మోస్ట్ 102 కోట్లతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత మాస్ మూవీస్ బాగా తీస్తాడు అన్న పేరున్న మాస్ డైరెక్టర్ హరి డైరెక్షన్ లో చేసిన కొత్త సినిమా…

రత్నం(Rathnam Movie) తో ఆడియన్స్ ముందుకు ఈ సమ్మర్ లో మరో మాస్ హిట్ కొడతాడు అని అందరూ అనుకున్నా కూడా మొదటి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా ఇక తేరుకోలేక పోయింది. ఓపెనింగ్స్ నుండే నిరాశ పరిచే కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా వీకెండ్ లోనే రిజల్ట్ ను…

ఆల్ మోస్ట్ కన్ఫాం చేసుకున్నా ఎంతో కొంత ఆక్యుపెన్సీతో రన్ అయినా కూడా వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా చేతులు ఎత్తేసింది. కాగా సినిమా కి తమిళ్ లో చాలా చోట్ల సమ్మర్ ఎఫెక్ట్ అండ్ బ్యాడ్ టాక్ కారణంగా సరైన ఆక్యుపెన్సీ కూడా లేక పోవడంతో షోలు కూడా కాన్సిల్ అయ్యే పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.

ఈ ఇయర్ తమిళ్ లో పెద్దగా సక్సెస్ ఫుల్ మూవీస్ లేక పోవడంతో మాస్ కంటెంట్ తో వచ్చిన రత్నం మూవీ డీసెంట్ ఫుట్ ఫాల్స్ ను థియేటర్స్ లో సొంతం చేసుకుంటుంది అనుకున్నా కూడా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోగా తెలుగు లో కూడా డీసెంట్ మార్కెట్ ఉన్న విశాల్ కి…

ఈ సారి నిరాశ పరిచే రిజల్ట్ సొంతం అయ్యింది అని చెప్పాలి. ఇక్కడ అసలే అన్ సీజన్ ఎఫెక్ట్ గట్టిగా ఉండగా ఎండల వలన జనాలు అసలు బయటికి రావడం లేదు. ఆ ఇంపాక్ట్ కూడా కలిపి రత్నం ఇక్కడ కూడా చాలా వరకు షోలు కాన్సిల్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద 102 కోట్ల కెరీర్ బెస్ట్ హిట్ తర్వాత భారీ నిరాశ పరిచే రిజల్ట్ ను రత్నం మూవీ సొంతం చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here