మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్టకేలకు ఈ ఇయర్ సంక్రాంతి కి క్రాక్ సినిమాతో సెన్సేషనల్ కంబ్యాక్ ఇవ్వడమే కాదు వరుస ఫ్లాఫ్స్ కి బ్రేక్ వేసి, 50% ఆక్యుపెన్సీ తోనే కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేశాడు. ఇలాంటి టైం లో రవితేజ వరుసగా సినిమాలను కమిట్ అవుతూ ఉండగా ముందుగా సమ్మర్ కానుకగా ఖిలాడీ సినిమా తో ఆడియన్స్ ముందుకు…
రావాల్సి ఉంది కానీ ఇప్పుడు సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన సినిమా రిలీజ్ ను ఆపెస్తున్నామంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక పరిస్థితులు సద్దుకున్నాకే సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుందని సమాచారం. ఇంకా సినిమా షూటింగ్ బాలెన్స్ ఉండగా ఇప్పుడు సెకెండ్ వేవ్…
ఎఫెక్ట్ వలన అందరి డేట్స్ అండ్ బడ్జెట్ ఇష్యూస్ కూడా వస్తున్నాయట. ఇవి గమనించిన రవితేజ డైరెక్టర్ తో కలిసి సినిమా బడ్జెట్ ను కంట్రోల్ లో పెట్టి ఇప్పుడు తగ్గించే పనిలో పడ్డారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇటలీ లో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ జరగగా అక్కడ అనుకున్న బడ్జెట్ కన్నా కూడా..
ఎక్కువ బడ్జెట్ అయిందట, ఇక హైదరాబాదు వచ్చిన తర్వాత మరో 2 సాంగ్స్ ను ఫారన్ షూటింగ్ లో కంప్లీట్ చేయాలనీ అనుకోగా ఇప్పుడు సెకెండ్ వేవ్ వలన అక్కడ వద్దని ఇక్కడే సెట్ వేసి చేద్దామని అలాగే రెమ్యునరేషన్ కొంచం తగ్గించుకుందామని చెబుతూ మొత్తం మీద నిర్మాతకి ఇప్పుడు 5-7 కోట్ల మేర బడ్జెట్ ను తగ్గించబోతున్నారని టాక్ ఉంది…
దాంతో కొంచం ఆలస్యం అయినా నిర్మాత కి పెద్దగా ఇబ్బంది ఉండదని అంటున్నారు. రవితేజ గొప్ప మనసుకు మెచ్చుకుని తీరాల్సిందే. ఇక సినిమా బాలెన్స్ షూటింగ్ అయ్యాక టోటల్ బడ్జెట్ లెక్కలు తేలనున్నాయి…అన్నీ సద్దుకున్నాక సినిమా కి బిజినెస్ ఎక్కువ అయితే ఇటు రవితేజ కి అటు డైరెక్టర్ కి ప్రాఫిట్స్ లో కొంత అమౌంట్ ఇవ్వాలని నిర్మాత భావిస్తున్నారని అంటున్నారు.
Vakeelsaab 28, days. Collections pettu bro