Home న్యూస్ ఖిలాడి ట్రైలర్ రివ్యూ…..పేకాట లో నలుగురు కింగ్స్ ఉంటారు,ఈ ఆటలో ఒక్కడే కింగ్!!

ఖిలాడి ట్రైలర్ రివ్యూ…..పేకాట లో నలుగురు కింగ్స్ ఉంటారు,ఈ ఆటలో ఒక్కడే కింగ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైం తర్వాత క్రాక్ సినిమాతో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన మాస్ మహారాజ్ రవితేజ ఆ సక్సెస్ ను కంటిన్యూ చేయడానికి చేస్తున్న లేటెస్ట్ మూవీ ఖిలాడి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నెల 11న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు. అనుకున్న టైం ఒకటి అయితే లేట్ చేసి ఆలస్యంగా ట్రైలర్ ను ఆడియన్స్ ముందుకు…

Krack 3 weeks(21 Days) Total Worldwide Collections

తీసుకు వచ్చారు… అయినా కానీ ట్రైలర్ ను చూస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర రవితేజ క్రాక్ విజయాన్ని కంటిన్యూ చేసేలా ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకునేలా ఉన్నాడని చెప్పాలి. సినిమా ట్రైలర్ లో కథని ఏమి రివీల్ చేయలేదు కానీ…

ఒక కంటైనర్ లో లో డబ్బుల కట్టలు ఉండటం, ఆ డబ్బు కోసం ఆల్ రెడీ కొందరు ఎదురు చూస్తూ ఉండటం, కానీ ఆ డబ్బు గురించి హీరోకి తెలియడం, దాంతో హీరోని దాటుకుని డబ్బు దగ్గరకి ఎలా వెళ్లాలని విలన్స్ ఎత్తులు, వాళ్ళని హీరో ఎలా అడ్డుకుని డబ్బుని సొంతం చేసుకున్నాడు అన్నట్లు…

ట్రైలర్ లో చూపించగా స్టైలిష్ యాక్షన్ మూవీగా రాబోతున్న ఖిలాడిలో విజువల్స్ కానీ గ్రాండియర్ కానీ క్వాలిటీ కానీ అదిరిపోయింది అనే చెప్పాలి. ఇక రవితేజ మరోసారి ఫుల్ ఎనర్జీతో కుమ్మేయగా పేకాట లో నలుగురు కింగ్స్ ఉంటారు,ఈ ఆట లో ఒక్కడే కింగ్ అంటూ చెప్పిన డైలాగ్ బాగుండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. సినిమాలో ఇతర స్టార్ కాస్ట్….

చాలా పెద్దదిగా ఉండగా అందరినీ పరిచయం చేస్తూ ట్రైలర్ ఓవరాల్ గా ప్రామిసింగ్ గానే ముగిసింది అని చెప్పాలి. మరి సినిమా కూడా ఇదే విధంగా ప్రామిసింగ్ గా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర రవితేజ ఖాతాలో మరో హిట్ పడటం ఖాయమని చెప్పొచ్చు. ఇక ట్రైలర్ కి మొత్తం మీద 24 గంటలలో ఎలాంటి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here