Home న్యూస్ C.E.O కాదు…గేమ్ చేంజర్….కాచుకోండి ఇక!!

C.E.O కాదు…గేమ్ చేంజర్….కాచుకోండి ఇక!!

1

టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఫస్ట్ మూవీతోనే సంచలనాలు సృష్టించి రెండో సినిమాకే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తర్వాత ఫ్లాఫ్స్ ను ఫేస్ చేసినా రచ్చ, నాయక్, ఎవడు సినిమాలతో దుమ్ము లేపి తర్వాత ధృవ సినిమాతో కొత్త మేకోవర్ ని ట్రై చేసి తర్వాత రంగస్థలంతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసిన తర్వాత వినయ విదేయ రామతో నిరాశ పరిచినా…

ఎన్టీఆర్ తో చేసిన ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ లెవల్ లో పేరును సొంతం చేసుకున్న రామ్ చరణ్, ఆ సినిమా తర్వాత ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైరెక్టర్ గా పేరున్న శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న కొత్త సినిమా అఫీషియల్ టైటిల్ ను…

రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా ఎట్టకేలకు అనౌన్స్ చేశారు, గత కొన్ని రోజులుగా సినిమా టైటిల్ సర్కారోడు అంటూ వార్తలు రాగా ఆ టైటిల్ కన్నా కూడా C.E.O అనే టైటిల్ బాగా చక్కర్లు కొట్టింది, కానీ ఆ టైటిల్ కూడా కాదని అఫీషియల్ టైటిల్ గా ఇప్పుడు…

గేమ్ చేంజర్ అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్…. టైటిల్ తోనే ఓ రేంజ్ లో మెప్పించిన ఈ సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు వస్తే అప్పుడు ఆల్ ఇండియా రికార్డుల వర్షం కురిపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఈ రోజు పుట్టిన రోజును జరపుకుంటున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం… మీరు మీ విషెస్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి…

1 COMMENT

Leave a Reply to Hemanth Cancel reply

Please enter your comment!
Please enter your name here