మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ సినిమా ఆడియన్స్ ముందుకు అక్టోబర్ 1 న రావడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. సాయి ధరం తేజ్ హాస్పిటల్ లోనే ఉండటం తో టోటల్ మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ ని భుజాన మోయడానికి సిద్ధం అయ్యారు అని చెప్పాలి.
ఇక ట్రైలర్ చూస్తుంటే ఇంటెన్స్ పొలిటికల్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది. ఇది కచ్చితంగా రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు, సీరియస్ గా సాగే పొలిటికల్ మూవీ…. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తె ట్రైలర్ ఓ రేంజ్ లో కుమ్మేసే విధంగా ఇంప్రెస్ చేసింది అని చెప్పాలి.
ప్రతీ డైలాగ్ లోనూ దేవకట్ట తన మార్క్ తో ఓ రేంజ్ లో మెప్పించాడు అని చెప్పాలి. అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది!, మీ భయం, అజ్ఞానం, అమాయకత్వం, విశ్వాసామే ఆ సింహాసనానికి నాలుగు కాళ్లు లాంటి డైలాగ్స్ ట్రైలర్ లో మెయిన్ హైలెట్ అవ్వగా…
స్ట్రిక్ట్ కలెక్టర్ గా సాయి ధరం తేజ్ ఏకంగా ముఖ్యమంత్రి అయిన రమ్యకృష్ణ పై పోరాటానికి దిగుతాడు… అలా చేయడానికి గల కారణం ఏంటి, ఆ క్రమం లో ఎదురుకున్న పరిస్థితులు ఏంటి… వాటిని ఎదిరించి తను అనుకున్నది ఎలా సాధించాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైలర్ లో జగపతిబాబు అలాగే ఐశ్వర్య రాజేష్ లు కూడా కనిపించగా…
డైలాగ్స్ అన్నీ చాలా సీరియస్ గా ఇంటెన్స్ గా ఉండటం తో సినిమా చాలా సీరియస్ గా సాగే సినిమా అని అర్ధం అవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ ఫ్యూ నుండి చూస్తె ట్రైలర్ బాగా ఇంప్రెస్ చేసింది కానీ కమర్షియల్ మూవీస్ ని ఎక్కువగా చూసే ఆడియన్స్ ఈ సినిమా ను ఎంతవరకు చూడటానికి థియేటర్స్ కి వస్తారు అన్నదానిపై ఈ సినిమా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని చెప్పొచ్చు.