మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ దేవకట్టా ల కాంబినేషన్ లో రూపొందిన పొలిటికల్ మూవీ రిపబ్లిక్ ఫస్ట్ లుక్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో బజ్ ను క్రియేట్ చేసినా కానీ ఎందుకో కామన్ ఆడియన్స్ కి సినిమా మరీ అనుకున్న రేంజ్ లో రీచ్ కాలేదు… ట్రైలర్ కూడా పవర్ ఫుల్ గా ఉన్న ఇది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను మాత్రమే టార్గెట్ చేసి తీసిన సినిమా అవ్వడం తో…
కామన్ ఆడియన్స్ ఎక్కువ శాతం ఇప్పుడు సినిమా మౌత్ టాక్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా తెలుగు రాష్ట్రాలలో టోటల్ థియేటర్స్ ని గమనిస్తే.. నైజాంలో 215 థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా టోటల్ ఆంధ్రలో 380 కి పైగా థియేటర్స్ లో…
రిలీజ్ ను కన్ఫాం చేసుకోగా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 600 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 740 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ మొదలు అయ్యి కొన్ని రోజులు అవుతూ ఉంది కానీ…
ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ ఏమి కూడా ఆశించిన మేర అయితే లేవు, ప్రమోషన్స్ కూడా పెద్దగా కనిపించడం లేదు కాబట్టి ఆడియన్స్ ని ఇప్పుడు థియేటర్స్ కి రప్పించాలి అంటే సినిమా మౌత్ టాక్ కచ్చితంగా పాజిటివ్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ ని చూస్తె మట్టుకు…
మొదటి రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సొంతం చేసుకునే అవకాశం ఉంది, టాక్ పాజిటివ్ గా ఉండీ షో షో కి కలెక్షన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. మరి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక.