మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ వరుస పెట్టి హాట్రిక్ విజయాలను నమోదు చేసిన తర్వాత ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిపబ్లిక్ అనే ఎక్స్ పెరిమెంటల్ మూవీ తో వచ్చాడు. సినిమా కి ఆడియన్స్ నుండి డీసెంట్ టాక్ వచ్చినా కానీ ఆడియన్స్ ఈ సీరియస్ మూవీ ని థియేటర్స్ చూడటానికి పెద్దగా ఆసక్తిని ఏమి చూపలేదు. దాంతో సినిమా ఓపెనింగ్స్ నుండే అంచనాలను అందు కోలేక పోయింది అని చెప్పాలి.
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద 10 రోజుల టైం లో 6.65 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా తర్వాత మిగిలిన రన్ కంప్లీట్ అయ్యే టైం కి సినిమా మరో 21 లక్షల మేర కలెక్షన్స్ ని మొత్తం మీద సొంతం చేసుకుంది. ఏ దశలో కూడా సినిమా…
ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకునే దిశగా అడుగులు వేయలేక పోయింది. సినిమా కంటెంట్ పర్వాలేదు అనిపించేలా ఉన్నప్పటికీ ఆడియన్స్ చాయిస్ వేరేగా ఉండటం తో సినిమా బిజినెస్ ను అందుకోలేక గట్టి లాస్ ను సొంతం చేసుకుంది. టోటల్ రన్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.97Cr
👉Ceeded: 1.16Cr
👉UA: 79L
👉East: 45L
👉West: 43L
👉Guntur: 47L
👉Krishna: 46L
👉Nellore: 31L
AP-TG Total:- 6.04CR(10.05CR~ Gross)
Ka+ROI: 33L
OS – 49L
Total WW: 6.86CR(12.65CR~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ కంప్లీట్ అయ్యే టైం కి సాధించిన టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్…
సినిమాను మొత్తం మీద 12 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 12.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5.64 కోట్ల లాస్ ను సొంతం చేసుకుని ఓవరాల్ గా డిసాస్టర్ గా పరుగును కంప్లీట్ చేసుకుంది. వరుసగా హాట్రిక్ విజయాలను అందుకున్న సాయి ధరం తేజ్ కి ఈ సినిమా గట్టి ఎదురుదెబ్బ కొట్టినట్లు అయింది.