ఇలాంటి సమయం లో క్లాస్ తో పాటు మాస్ ని ఆకట్టుకునేలా మారుతి డైరెక్షన్ లో శైలజా రెడ్డి అల్లుడు అంటూ సరికొత్త సినిమా తో వచ్చేశాడు నాగ చైతన్య. మరి ఆలస్యం చేయకుండా సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.
స్టోరీ: ముందుగా కథ విషయానికి వస్తే ఈగోయిస్ట్ అయిన హీరో తండ్రి మరో ఈగోయిస్ట్ అయిన రమ్యకృష్ణ కూతురు అను ఎమాన్యుయెల్ తో హీరో పెళ్లి ఫిక్స్ చేస్తాడు…ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే హీరోయిన్ కూడా చాలా ఈగో.. ఇలా ఇంత మంది ఈగోయిస్ట్ ల నడుమ హీరో పడిన పాట్లే సినిమా కథ.
ఇక్కడ మరో చిన్న ట్విస్ట్ హీరోయిన్ కి వాళ్ళ అమ్మకి గతం లో జరిగిన ఒక సంఘటన వలన మాటలు ఉండవు…వాళ్ళిద్దరిని హీరో ఎలా కలిపాడు అన్నది అసలు కథ.
విశ్లేషణ: చెప్పుకోవడానికి సినిమాలో పెద్ద కథ లేకున్నా కానీ స్క్రీన్ ప్లే తో చాలా వరకు మ్యానేజ్ చేశాడు దర్శకుడు మారుతి. తన పాత సినిమాల్లో ఒకసారి మతిమరుపుని మరోసారి అతి శుభ్రతని కథా వస్తువుగా వాడుకున్న మారుతి ఇప్పుడు ఈగో ని వాడుకున్నాడు.
దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు చాలా వరకు ఎంటర్ టైన్ మెంట్ గా ఉండటం ప్లస్ అయ్యింది. నాగ చైతన్య తన రోల్ వరకు అద్బుతంగా నటించి మెప్పించాడు. తన రీసెంట్ మూవీస్ అన్నింటిలోకి ఇదే బెస్ట్ లుక్ అని చెప్పొచ్చు. అను మరియు రమ్యకృష్ణ రోల్స్ బాగా సెట్ అయ్యాయి. మిగిలిన నటీనటులలో మురళీకృష్ణ, వెన్నెల కిషోర్, 30 ఈయర్స్ పృద్వి ఇలా అందరూ ఆకట్టుకున్నారు…
సంగీతం: గోపి సుందర్ అందించిన సంగీతం పర్వాలేదు అనిపించే విధంగా ఉంటుంది…బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమా కి తగ్గట్లు ఉంది. యాక్షన్ సీన్స్ కి మాత్రం అదుర్స్ అనిపించే బ్యాగ్రౌండ్ స్కోర్ ని అందించాడు. ఓవరాల్ గా మంచి మార్కులే పడ్డాయి.
హైలెట్స్ : కామెడీ సీన్స్, ఫైట్స్, నాగ చైతన్య
మైనస్: కథ స్ట్రాంగ్ గా లేకపోవడం, అక్కడక్కడ స్లో అవ్వడం
ఫైనల్ టాక్: రొటీన్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వారికి, కామెడీ ఎంటర్ టైనర్ ఇష్టపడే వారికి, ఫ్యామిలీ అండ్ యూత్ కి సినిమా స్టోరీ పక్కన పెడితే ఎంటర్ టైన్ మాత్రం తప్పకుండా చేస్తుంది. అక్కడక్కడా స్లో అయినా మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో థియేటర్స్ బయటికి వస్తారు.
T2B Live రేటింగ్—-2.75/5