సినిమాలు ఎలా తీసినా కానీ వాటి ద్వారా లాభాలను సొంతం చేసుకునే కెపాసిటీ కొందరికే ఉంటుంది, అలాంటి వాళ్ళలో రామ్ గోపాల్ వర్మ ముందు నిలిచే వ్యక్తీ అని చెప్పాలి, లెక్కకు మించి సినిమాలు తీస్తున్నా అవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేయకున్నా కానీ వాటి డిజిటల్ శాటిలైట్ రైట్స్ ని ఇప్పటికీ కొనే వాళ్ళు ఉన్నారు, అందుకే రామ్ గోపాల్ వర్మ ఆ సినిమాలను మార్కెట్ చేసి…
మినిమమ్ లాభాలను సొంతం చేసుకుంటున్నాడు. లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన రామ్ గోపాల్ వర్మ మూవీ దెయ్యం. ఎప్పుడో 2014 లో తీసిన ఈ సినిమా ను రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు తీసుకు రాగా జనాలు అసలు పట్టించుకోలేదు.
దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయ్యింది కానీ ఇలాంటి సినిమా తో కూడా రామ్ గోపాల్ వర్మ సాలిడ్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్నాడు. మొత్తం మీద సినిమాను 55 లక్షల రేంజ్ బడ్జెట్ లో నిర్మించగా సినిమా థియేట్రికల్ బిజినెస్ కింద 30 లక్షల దాకా బిజినెస్ ను మొత్తం మీద సొంతం చేసుకుంది.
ఇక సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడు పోగా వాటి ద్వారా ఏకంగా 1.5 కోట్ల రేటు సొంతం అయ్యిందట. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ కిందా మరో 35 లక్షల దాకా వచ్చాయని ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు. అంటే మొత్తం మీద సినిమా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ కింద ఏకంగా 2.15 కోట్ల బిజినెస్ ను మొత్తం మీద సొంతం చేసుకుంది.
అందులో సినిమా బడ్జెట్ 55 లక్షలను పక్కకు పెట్టినా మొత్తం మీద ఈజీగా 1.6 కోట్ల మేర ప్రాఫిట్ ను రామ్ గోపాల్ వర్మ సొంతం చేసుకున్నాడు అని చెప్పొచ్చు. ఎప్పుడో 7 ఏళ్ల క్రితం మూవీ తోనే ఇలాంటి లాభాలు అంటే కొత్త సినిమాలతో ఎలా ప్రాఫిట్ లను సొంతం చేసుకుంటున్నాడో అర్ధం చేసుకోవచ్చు ఇక..