Home న్యూస్ పవర్ స్టార్ మూవీ రివ్యూ…ఏంటి సామి ఇది!!

పవర్ స్టార్ మూవీ రివ్యూ…ఏంటి సామి ఇది!!

2

రీసెంట్ టైం లో రామ్ గోపాల్ వర్మ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు… లాక్ డౌన్ టైం లో అందరూ ఇళ్లకే పరిమితం అయితే RGV మాత్రం తనకి తోచిన రీతిలో షార్ట్ మూవీస్ చేసుకుంటూ వాటిని బిజినెస్ చేసుకుంటూ ప్రాఫిట్స్ తో దూసుకు పోతున్నాడు. ఈ క్రమంలో పవర్ స్టార్ అంటూ కొత్త సినిమా ను నేడు రిలీజ్ చేయగా రిలీజ్ కి ముందే అనేక కాంట్రవర్సీలను ఎదురుకుంది ఈ సినిమా.

తీరా నేడు రిలీజ్ అయ్యాక సినిమా ఎలా ఉందీ అంటే ఎవ్వరూ ఏమి చెప్పలేని పరిస్థితి. ఇది అసలు సినిమానే కాదు, షార్ట్ ఫిల్మ్ కి కొంచం లెంత్ ఎక్కువ పెట్టారు అంతే… కేవలం 37 నిమిషాల లెంత్ ఉన్న ఈ సినిమా లో ఓ కొన్ని సీన్స్ ఒకటి తర్వాత ఒకటి వస్తాయి అంతే….

ఫస్ట్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రవన్ అంతర్మధనం, తర్వాత తన అన్నయ్య తన పై చూపే కోపం సలాహా, తర్వాత తన డైరెక్టర్ తో ఎన్నికల ముందు హడావుడి, ఎన్నికల తర్వాత సినిమాల గురించి మీటింగ్, మధ్య మధ్యలో ముంబై నుండి ఫోన్ కాల్స్..

తన పై ఎన్నో కాంట్రవర్సీలు చేసిన విలేఖరికే ఇంటర్వ్యూ ఇవ్వడం, పరిస్థితి అర్ధం చేసుకోలేని భార్య పిల్లలు, అన్నయ్య ని తమ్ముడిని బయట ఇలా అనుకుంటున్నారు అంటూ ఫోన్ లో చెప్పే మరో అన్నయ్య, తాను ఓడిపోవాలని కోరుకునే ఓ ప్రొడ్యూసర్, అపోజిట్ పార్టీ లీడర్ తో చేరడం వలెనే ఇదంతా జరిగింది అని ఆయనే చెప్పడం…

చివరగా పవర్ స్టార్ కి గీతోపదేశం చేయడానికి వచ్చిన వర్మ తనతో ఏం చెప్పాడు అన్నది క్లైమాక్స్… సీన్ బై సీన్ గా పేర్చుకుంటూ వెళ్ళిన ఈ షార్ట్ ఫిల్మ్ యిట్టె టైం గడిచేలా ఉంది కానీ ఓవరాల్ గా చెప్పాలి అంటే మాత్రం ఏం తీశాడు చెప్పడానికి అని అనిపిస్తుంది.

టోటల్ ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత RGV దృష్టిలో హీరో పక్కన ఉండే వాళ్ళ మాటలు విని ఇలాంటి పరిస్థితి ని తెచ్చుకున్నాడు అని చెప్పాడు. అలాగే తానె మీ అందరి ఫ్యాన్స్ కన్నా కూడా అతిపెద్ద ఫ్యాన్ ని అని రాబోయే 2024 ఎన్నికల్లో మీరే సీఎం అవ్వడం ఖాయమని చెబుతూ సినిమా ముగించాడు.

ఓవరాల్ గా చూసుకుంటే అటు కొన్ని విమర్శలు చేస్తూనే చివర్లో హిత బోధ చేయడం తో పాటు పవర్ స్టార్ ఒక్క పైసా కూడా పక్క పార్టీ నుండి తీసుకోలేదని, అంతటి నిజాయితీ పరుడు పక్కనున్న వాళ్ళ మాట వినడం వల్ల ఓడిపోవాల్సి వచ్చిందని చెప్పినట్లు ఉంది ఈ షార్ట్ ఫిల్మ్…

ఫ్యాన్స్ కొంచం కోపం తెచ్చుకునే సీన్స్ పెట్టిన క్లైమాక్స్ లో మళ్ళీ హీరో ని ఓ రేంజ్ లో పొగిడి పక్క పార్టీలను తన భజన గ్యాంగ్ ని తిడుతూ బాలెన్స్ చేశాడు రామ్ గోపాల్ వర్మ… అది ఎవరు ఎలా అర్ధం చేసుకుంటారు అన్నది ఎవ్వరూ చెప్పలేం అనే చెప్పాలి. మొత్తం మీద 150 పెట్టి 37 నిమిషాల సినిమా కానీ సినిమా చూడటం పక్కా టైం వేస్ట్ అనే చెప్పాలి.

2 COMMENTS

  1. Bongulo review , actor yela chesaaru ?, script yelaa undi , cinematography yelaa undi ? screenplay yedi ledaa just varmaa gurinchi matrame cheppataaniki vaadini thittataanike nee review ayithe ikkada chadavataanikemundoi ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here