క్రియేటివ్ డైరెక్టర్ గా ఒకప్పుడు అద్బుతమైన సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఫాం కోల్పోయి చాలా టైం అవ్వగా రీసెంట్ గా ప్రాపగాండ నేపధ్యంలో పొలిటికల్ నేపధ్యంలో కొన్ని సినిమాలు తీసినా కూడా ఏవి కూడా అంచనాలను అందుకోలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ గోపాల్ వర్మ తీసిన…
వ్యూహం(Vyooham Movie) మినిమమ్ ఫుట్ ఫాల్స్ ను కూడా తెప్పించుకోలేక డిసాస్టర్ గా నిలిచింది, ఈ సినిమా కి సీక్వెల్ గా రామ్ గోపాల్ వర్మ తీసిన మరో సినిమా శపథం(Shapadham Movie) థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో AP ఫైబర్ నెట్ లో పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేశారు….
అక్కడ కూడా సినిమా కి రెస్పాన్స్ దారుణంగానే ఉందని చెప్పాలి. అసలు స్టోరీ పాయింట్ లేకుండా వాళ్ళని వీళ్ళని ట్రోల్ చేయడమే ధ్యేయంగా పెట్టుకుని ఎవేవే సీన్స్ తీసిన రామ్ గోపాల్ వర్మ ఒక సెక్షన్ ని ఆకట్టుకునే పనిలో మిగిలిన ఆడియన్స్ ను మినిమమ్ ఇంప్రెస్ చేయలేక పోయాడు…
దాంతో సినిమా ఏమాత్రం ఆసక్తి కలిగించ లేక పోయింది, వ్యూహం సినిమానే నిరాశ పరిచింది అనుకుంటే దానికి మించి నిరాశ కలిగించే విధంగా ఉంది శపథం సినిమా… దాంతో రామ్ గోపాల్ వర్మ ఖాతాలో మరో డిసాస్టర్ మూవీ గా ఈ సినిమా నిలిచింది అని చెప్పొచ్చు….