Home న్యూస్ బాలయ్య ని “ఇలా” చూపావేంటి వర్మ!

బాలయ్య ని “ఇలా” చూపావేంటి వర్మ!

0

   సినిమాల్లో పవర్ ఫుల్ డైలాగ్స్ తో ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించు కునే బాలయ్య బయట కొన్ని సార్లు అనుకోకుండా మాట్లాడే మాటలు విమర్శలకు దారి తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే, ఇక ఎన్టీఆర్ బయోపిక్ ని ముందు వర్మ చేతి లో పెట్టి చెప్పింది తీయమని చెప్పిన బాలయ్య మాట కి నాకు నచ్చింది తీస్తా అన్న వర్మ తో విభేదాలు రావడం తో సినిమాను చేతులు మార్చేశాడు బాలయ్య.

Lakshmis NTR First Day Collections - Solid Openings

దాంతో అప్పటి నుండి లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ అసలు కథ చెబుతా అంటూ రంగం లోకి దిగిన వర్మ సినిమా ని బాలయ్య కే అంకితం ఇస్తున్నాను అంటూ కామెంట్స్ చేశాడు, సినిమాలో కూడా స్పెషల్ థాంక్స్ కార్డ్ వేసి అందరికీ షాక్ ఇచ్చాడు.

ఇక్కడి వరకు ఎలా ఉన్నా సినిమాలో బాలయ్య ని చూపెట్టిన విధానం మాత్రం కొందరికీ నచ్చడం లేదు, సినిమా లో కామెడీ కోసం అన్నట్లు బాలయ్య రోల్ వేసిన వ్యక్తి చేత చెప్పిన డైలాగ్స్ సినిమా లో సీరియస్ సమయం లో వచ్చినా అవి చూస్తున్న ఆడియన్స్ చేత నవ్వుల పూవులు పూసేలా చేసింది.

సినిమాలో అనేక సందర్భాలలో బాలయ్య క్యారక్టర్ మాట్లాడే డైలాగ్స్ కి థియేటర్స్ లో నవ్వులు రావడం జరిగింది, వర్మ ఇది కావాలనే ఊహించి రాసుకున్నాడు అంటూ కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రేక్షకుల మనసును…

తొలిరోజు టాక్ కి అతీతంగా గెలిచుకుందనే చెప్పాలి. తొలిరోజు వసూళ్లు అంచనాలను మించి వచ్చినట్లు సమాచారం. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుంది అన్నది ఇప్పుడు అందరి లోను ఆసక్తి రేపుతున్న ప్రశ్న గా చెప్పుకోవాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here