Home న్యూస్ ఇదే ఫైనల్….RRR మూవీ ఫైనల్ టాక్ ఇదే!!

ఇదే ఫైనల్….RRR మూవీ ఫైనల్ టాక్ ఇదే!!

0

వరల్డ్ వైడ్ గా 10 వేలకు పైగా థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రీమియర్ షోలను కంప్లీట్ చేసుకున్న టైం నుండే పాజిటివ్ టాక్ తో దుమ్ము లేపగా ఓవరాల్ గా అక్కడ నుండి హిట్ నుండి సూపర్ హిట్ రేంజ్ టాక్ వినిపించగా ఇక్కడ రెగ్యులర్ షోల టైం కి అందరూ ఫ్యాన్స్ తోనే నిండి పోగా వాళ్ళ నుండి సినిమా కి సూపర్ హిట్ కి తగ్గని….

టాక్ కంటిన్యూ అయింది అని చెప్పాలి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ కామన్ ఆడియన్స్ భారీ లెవల్ లో థియేటర్స్ కి తరలి రాగా వాళ్ళ నుండి సినిమా కి వినిపిస్తున్న టాక్ ఎలా ఉంది అన్నది ఆసక్తిగా మారగా…

వాళ్ళ నుండి కూడా సినిమా కి రెస్పాన్స్ సూపర్ పాజిటివ్ గానే ఉందని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎమోషన్స్, హీరోల పెర్ఫార్మెన్స్ రాజమౌళి టేకింగ్ ఎక్స్ లెంట్ గా నచ్చగా సెకెండ్ ఆఫ్ లో కొన్ని సీన్స్ మాత్రం బోర్ కొట్టాయని కానీ మిగిలిన సినిమా మొత్తం కూడా అదిరి పోయింది అంటున్నారు.

ఓవరాల్ గా సినిమా కి వీళ్ళ నుండి కూడా హిట్ నుండి సూపర్ హిట్ టాక్ వినిపిస్తూ ఉండగా, కామన్ ఆడియన్స్ పరంగా హీరోల ఎలివేషన్స్ అదిరిపోయాయని, ఫైట్స్ అద్బుతమని అంటున్నా కథ అంత బలంగా లేక పోవడం, సెకెండ్ ఆఫ్ కొంచం డ్రాగ్ అయినట్లు అనిపించడం చిన్న సినిమా మైనస్ పాయింట్స్ అయినా ఓవరాల్ గా సినిమా…

అంచనాలను అందుకుంటూ ఎక్స్ పెర్టేషన్స్ ని రీచ్ అయ్యిందని అంటున్నారు, వీళ్ళ నుండి సినిమా కి హిట్ రేంజ్ లో రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి అని చెప్పాలి. మొత్తం మీద డే స్టార్ట్ అయినప్పటి నుండి కూడా యునానిమస్ హిట్ రిపోర్ట్స్ ని సినిమా క్యారీ చేస్తూ ఉండటంతో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ జాతర ఖాయమని చెప్పొచ్చు అంటున్నారు. ఇక కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here